తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Umbrellas : తిరుమల చేరుకున్న చెన్నై గొడుగులు, గరుడసేవలో స్వామి వారికి అలంకరణ

Tirumala Umbrellas : తిరుమల చేరుకున్న చెన్నై గొడుగులు, గరుడసేవలో స్వామి వారికి అలంకరణ

07 October 2024, 18:45 IST

Tirumala Umbrellas : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమ‌వారం తిరుమలకు తీసుకొచ్చారు. గొడుగులను టీటీడీ అధికారులకు అందజేశారు.

  • Tirumala Umbrellas : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమ‌వారం తిరుమలకు తీసుకొచ్చారు. గొడుగులను టీటీడీ అధికారులకు అందజేశారు.
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. 
(1 / 6)

సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 
(2 / 6)

ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో  సీహెచ్ వెంక‌య్య చౌద‌రికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం గొడుగులను ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
(3 / 6)

చెన్నైకి చెందిన తిరుప‌తి అంబ్రాలా చారిటిస్ ట్రస్టీ వ‌ర‌ద‌రాజులు 11 గొడుగుల‌ను టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావుకు శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద అంద‌జేశారు. 
(4 / 6)

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీమలయప్ప స్వామి వేణుగోపాల‌స్వామి అలంకారంలో క‌ల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. 
(5 / 6)

కల్పవృక్ష వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి