తెలుగు న్యూస్  /  ఫోటో  /  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహ‌నంపై శ్రీనివాసుడు విహారం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహ‌నంపై శ్రీనివాసుడు విహారం

25 September 2023, 22:16 IST

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీవారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు.

  • తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీవారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 
(1 / 5)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామి వారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. 
(2 / 5)

సోమవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహ‌న‌సేవ జ‌రిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో  స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
(3 / 5)

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.  
(4 / 5)

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్కరిణిలో స్నప‌న తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి