తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Leopard : తిరుమల నడక మార్గంలో చిరుతల కలకలం, భయాందోళనలో భక్తులు!

Tirumala Leopard : తిరుమల నడక మార్గంలో చిరుతల కలకలం, భయాందోళనలో భక్తులు!

20 May 2024, 17:24 IST

 Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.

  •  Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
(1 / 6)

అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల సంచారంపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చిరుతల జాడలను గుర్తించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 
(2 / 6)

భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 
(3 / 6)

ఐదు రోజుల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుతను భక్తులు చూశారు. తెల్లవారుజామున భక్తులు వెళ్తున్న కారుకు చిరుత అడ్డువచ్చింది. ఈ దృశ్యాలు కారు డాష్ కెమెరాలో  రికార్డు అయ్యాయి. 
(4 / 6)

గతేడాది అలిపిరి కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలతో  టీటీడీ, అటవీ అధికారులు అప్రమత్తమై ట్రాప్ కెమెరాలు, బోను పెట్టి చిరుతలను బంధించారు.  కొంత కాలం చిరుతల సంచారం తగ్గినా ఇటీవల మళ్లీ చిరుతల సంచారం కనిపిస్తుంది. 
(5 / 6)

భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. భక్తులను గుంపులుగా పంపుతుంది. అలాగే చేతి కర్రలు కూడా అందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో కూడా ట్రాప్ కెమెరాలలో చిరుత సంచారం రికార్డైంది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి