తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tiruchanoor : స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

Tiruchanoor : స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

26 August 2023, 8:14 IST

Tiruchanoor Sri Padmavathi Devi:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వేళ స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు. ఆ చిత్రాలు ఇక్కడ చూడండి…

  • Tiruchanoor Sri Padmavathi Devi:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వేళ స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు. ఆ చిత్రాలు ఇక్కడ చూడండి…
శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.
(1 / 5)
శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.(TTD)
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
(2 / 5)
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.(TTD)
ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.  
(3 / 5)
ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.  
అమ్మవారిని రోజా, చామంతి, మల్లె,  సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి  పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు
(4 / 5)
అమ్మవారిని రోజా, చామంతి, మల్లె,  సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి  పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు(TTD)
శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
(5 / 5)
శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.(TTD)

    ఆర్టికల్ షేర్ చేయండి