తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tips For Iphone Users: మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు టిప్స్.. వీటిని పాటిస్తే మరింత మెరుగ్గా

Tips for iPhone Users: మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు టిప్స్.. వీటిని పాటిస్తే మరింత మెరుగ్గా

01 January 2023, 21:14 IST

Tips to maximize battery life of Apple iPhone: కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఐఫోన్ మరింత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. సాధారణం కంటే మరింత ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టకుండా ఐఫోన్‍ను వాడుకోవచ్చు. బ్యాటరీ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. అలా ఐఫోన్ బ్యాటరీ లైఫ్‍ను మెరుగ్గా చేసే టిప్స్ ఇవే.

  • Tips to maximize battery life of Apple iPhone: కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఐఫోన్ మరింత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. సాధారణం కంటే మరింత ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టకుండా ఐఫోన్‍ను వాడుకోవచ్చు. బ్యాటరీ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. అలా ఐఫోన్ బ్యాటరీ లైఫ్‍ను మెరుగ్గా చేసే టిప్స్ ఇవే.
ఐఫోన్‍లను చార్జ్ చేసే సమయంలో కొన్ని రకాల బ్యాక్ కేస్‍లను తొలగిస్తే మంచిది. ముఖ్యంగా మందంగా ఉన్న బ్యాక్ కేస్‍లు ఉంటే.. వాటిని తొలగించి చార్జ్ చేయాలి. 
(1 / 7)

కొన్ని రకాల బ్యాక్ కేస్‍ల వల్ల చార్జ్ చేసే సమయంలో ఐఫోన్ లోపల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. దీని వల్ల బ్యాటరీ కెపాసిటీపై ప్రభావం పడుతుంది. దీంతో క్రమంగా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే మందంగా ఉండే బ్యాక్ కేస్‍లు వాడుతున్నట్టయితే చార్జింగ్ పెట్టే సమయంలో తొలగిస్తే బెస్ట్.
(2 / 7)

సాధారణంగా ఐఫోన్ స్క్రీన్లు ఎక్కువ బ్యాటరీని వాడుకుంటాయి. అందుకే బ్రైట్‍నెస్ తగ్గించుకుంటే ఎక్కువ సేపు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఆటో బ్రైట్‍నెస్ ఆప్షన్‍ను కూడా డిసేబుల్ చేసుకోవాలి. 
(3 / 7)

ఐఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేపు నిలిచి ఉండాలని అనుకున్న సమయంలో లో పవర్ మోడ్ (Low Power Mode)ను ఎనేబుల్ చేసుకోండి. సిస్టమ్ యానిమేషన్లను మినిమైజ్ చేయడం ద్వారా కూడా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.
(4 / 7)

ఒకవేళ చుట్టుపక్కల పరిసరాలు మరీ వేడిగా ఉండే ఆ సమయంలో ఐఫోన్ వాడకపోవడమే మంచిది.
(5 / 7)

మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో.. లేదా సిగ్నల్ చాలా తక్కువ ఉన్న సమయాల్లో ఎయిర్‌ప్లేన్ మోడ్ టర్న్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ డ్రైన్ అవకుండా ఉంటుంది. 
(6 / 7)

వినియోగించని యాప్‍లకు లొకేషన్ పర్మిషన్‍ను డిసేబుల్ చేయండి. 
(7 / 7)
వినియోగించని యాప్‍లకు లొకేషన్ పర్మిషన్‍ను డిసేబుల్ చేయండి. 

    ఆర్టికల్ షేర్ చేయండి