తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Rain Alert : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఈ 2 రోజులు ఉరుములతో కూడిన వానలు, ఆ తేదీన రాయలసీమలో అతి భారీ వర్షాలు..!

AP TG Rain ALERT : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఈ 2 రోజులు ఉరుములతో కూడిన వానలు, ఆ తేదీన రాయలసీమలో అతి భారీ వర్షాలు..!

12 October 2024, 6:22 IST

AP Telangana Weather Updates :  ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.  తెలంగాణలో రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద

  • AP Telangana Weather Updates :  ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.  తెలంగాణలో రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద
దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయని తెలిపింది.
(1 / 6)

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(2 / 6)

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది,
(3 / 6)

మంగళవారం(అక్టోబర్ 15) రాయలసీమలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు, కోస్తాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 6)

తెలంగాణలో చూస్తే ఇవాళ (అక్టోబర్ 12) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)

రేపు(అక్టోబర్ 13) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక శుక్రవారం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి