తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anantapuram Rains: ఏపీలో ఈసారి అనంతపురం వంతు.. పట్టణాన్ని ముంచెత్తిన పండమేరు వరద.. నీట మునిగిన ఇళ్లు

Anantapuram Rains: ఏపీలో ఈసారి అనంతపురం వంతు.. పట్టణాన్ని ముంచెత్తిన పండమేరు వరద.. నీట మునిగిన ఇళ్లు

22 October 2024, 12:42 IST

Anantapuram Rains: ఉమ్మడి అనంతలో వరద విలయం సృష్టించింది. విజయవాడను బుడమేరు ముంచెత్తినట్టే అనంతపురం పట్టణాన్ని అర్థరాత్రి పండమేరు చుట్టుముట్టింది.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. దీంతో భారీగా ఇళ్లు నీట మునిగాయి. 

  • Anantapuram Rains: ఉమ్మడి అనంతలో వరద విలయం సృష్టించింది. విజయవాడను బుడమేరు ముంచెత్తినట్టే అనంతపురం పట్టణాన్ని అర్థరాత్రి పండమేరు చుట్టుముట్టింది.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. దీంతో భారీగా ఇళ్లు నీట మునిగాయి. 
అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. పండమేరుకు వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది.
(1 / 6)

అనంతపురం జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పట్టణాన్ని అనుకుని ప్రవహించే పండమేరు పొంగడంతో వందలాది నివాసాలు నీట మునిగాయి.  కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోట్‌ బంక్‌లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
(2 / 6)

ఉమ్మడి అనంతలో వరద విళయం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. అనంతపురం జిల్లాలోని అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి.  వరద బాధితులను అధికారులు, ప్రజా ప్రతినిధులు పరామర‌్శించారు. 
(3 / 6)

శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతిలో నీరు పారుతోంది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఎన్నడూ కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రాలేదని పలు కాలనీలవాసులు తెలిపారు. 
(4 / 6)

భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందుతుంది. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 
(5 / 6)

అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో నీట మునిగిన పలు కాలనీల నుంచి ప్రజలను పోలీసు యంత్రాంగం  రక్షించింది. వరద ముంపుకు గురైన ప్రాంతాలను టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ తదితరులు పరిశీలించారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి