తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Thyroid Food: థైరాయిడ్ సమస్య ఉంటే కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవన్నీ

Thyroid Food: థైరాయిడ్ సమస్య ఉంటే కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవన్నీ

23 March 2024, 15:17 IST

Thyroid Food: ఎంతో మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలు ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.

  • Thyroid Food: ఎంతో మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలు ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూరగాయలు, విత్తనాలు, కాయలు, సిట్రస్ పండ్లు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తినాలి. ఇవి మీ థైరాయిడ్ పనితీరును కాపాడుతుంది.  థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం కీలకమని గుర్తుంచుకోండి. ఈ సమస్యను నియంత్రించాలంటే ఏం తినాలో తెలుసుకోండి.  
(1 / 6)
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూరగాయలు, విత్తనాలు, కాయలు, సిట్రస్ పండ్లు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తినాలి. ఇవి మీ థైరాయిడ్ పనితీరును కాపాడుతుంది.  థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం కీలకమని గుర్తుంచుకోండి. ఈ సమస్యను నియంత్రించాలంటే ఏం తినాలో తెలుసుకోండి.  (Unsplash)
విటమిన్ ఇ: ఈ ముఖ్యమైన విటమిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, నూనె, బాదం నూనెలో ఈ విటమిన్ అధికంగా లభిస్తుంది.  
(2 / 6)
విటమిన్ ఇ: ఈ ముఖ్యమైన విటమిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, నూనె, బాదం నూనెలో ఈ విటమిన్ అధికంగా లభిస్తుంది.  (Freepik)
సెలీనియం: థైరాయిడ్ హార్మోన్లకు ఇది ఒక ముఖ్యమైన పోషకం. నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సార్డినెస్, చేపలు, చికెన్, పుట్టగొడుగుల్లో ఇది అధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి.  
(3 / 6)
సెలీనియం: థైరాయిడ్ హార్మోన్లకు ఇది ఒక ముఖ్యమైన పోషకం. నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సార్డినెస్, చేపలు, చికెన్, పుట్టగొడుగుల్లో ఇది అధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి.  (Unsplash)
మెగ్నీషియం: ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. జీవక్రియ కోసం ఎంజైమ్ల పనితీరుకు సహాయపడుతుంది. బాదం, గుమ్మడి గింజలు, ఓట్స్, డార్క్ చాక్లెట్, బీన్స్, క్వినోవాలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
(4 / 6)
మెగ్నీషియం: ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. జీవక్రియ కోసం ఎంజైమ్ల పనితీరుకు సహాయపడుతుంది. బాదం, గుమ్మడి గింజలు, ఓట్స్, డార్క్ చాక్లెట్, బీన్స్, క్వినోవాలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.(Unsplash)
విటమిన్ బి12: జీవక్రియకు, శక్తి ఉత్పత్తికి అవసరమైనది ఈ విటమిన్. థైరాయిడ్ పనితీరుకు సహాయపడుతుంది. చికెన్, ట్యూనా, వేరుశెనగ, కాలేయం, పొద్దుతిరుగుడు విత్తనాలలో ఇది అధికంగా లభిస్తుంది.
(5 / 6)
విటమిన్ బి12: జీవక్రియకు, శక్తి ఉత్పత్తికి అవసరమైనది ఈ విటమిన్. థైరాయిడ్ పనితీరుకు సహాయపడుతుంది. చికెన్, ట్యూనా, వేరుశెనగ, కాలేయం, పొద్దుతిరుగుడు విత్తనాలలో ఇది అధికంగా లభిస్తుంది.(Live Hindustan)
విటమిన్ సి: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇన్ ఫ్లమ్మేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ సమతుల్యతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కివి, బెల్ పెప్పర్, బ్రోకలీ, మొలకలు, వివిధ రకాల చిక్కుళ్ళలో ఇది ఉంటుంది. వీటిని తరచూ తింటూ ఉండాలి.
(6 / 6)
విటమిన్ సి: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇన్ ఫ్లమ్మేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ సమతుల్యతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కివి, బెల్ పెప్పర్, బ్రోకలీ, మొలకలు, వివిధ రకాల చిక్కుళ్ళలో ఇది ఉంటుంది. వీటిని తరచూ తింటూ ఉండాలి.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి