తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dasara Jammi Chettu : ఈ జమ్మిచెట్టుకు వందేళ్లు.. ఎక్కడ ఉందో తెలుసా?

Dasara Jammi chettu : ఈ జమ్మిచెట్టుకు వందేళ్లు.. ఎక్కడ ఉందో తెలుసా?

06 October 2024, 17:18 IST

Dasara Jammi chettu : పాండవులు అరణ్యవాసం సమయంలో.. జమ్మిచెట్టుపై ఆయుధాలు పెట్టారని పురాణాలు చెబుతాయి. ఆ చెట్టు నుంచి ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్తే విజయం కలిగిందని ప్రతీతి. అందుకే తెలంగాణలో దసరా రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి.. సోరకాయను కోస్తారు.

  • Dasara Jammi chettu : పాండవులు అరణ్యవాసం సమయంలో.. జమ్మిచెట్టుపై ఆయుధాలు పెట్టారని పురాణాలు చెబుతాయి. ఆ చెట్టు నుంచి ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్తే విజయం కలిగిందని ప్రతీతి. అందుకే తెలంగాణలో దసరా రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి.. సోరకాయను కోస్తారు.
వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వందేళ్ల నాటి జమ్మిచెట్టు ఉంది. దసరా పండగ రోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
(1 / 5)
వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వందేళ్ల నాటి జమ్మిచెట్టు ఉంది. దసరా పండగ రోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.(HT Telugu)
ల్యాబర్తి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో ఈ జమ్మిచెట్టు దగ్గరకు చేరుకుంటారు.పెద్ద గంపలో సొరకాయ, సజ్జ, మొక్కజొన్నలను పట్టుకొని దసరా బండ దగ్గరకు వస్తారు.
(2 / 5)
ల్యాబర్తి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో ఈ జమ్మిచెట్టు దగ్గరకు చేరుకుంటారు.పెద్ద గంపలో సొరకాయ, సజ్జ, మొక్కజొన్నలను పట్టుకొని దసరా బండ దగ్గరకు వస్తారు.(HT Telugu)
జమ్మిచెట్టు దసరా బండ వద్ద కొత్తగా నిర్మించిన పాకలో సొరకాయకు పూజలు చేస్తారు. అనంతరం జంతు బలికి బందులుగా సొరకాయను కోస్తారు. ఈ చారిత్రక జమ్మిచెట్టు వద్దకు వెళ్లి కంకణాలు కట్టుకొని పూజలు నిర్వహిస్తారు.
(3 / 5)
జమ్మిచెట్టు దసరా బండ వద్ద కొత్తగా నిర్మించిన పాకలో సొరకాయకు పూజలు చేస్తారు. అనంతరం జంతు బలికి బందులుగా సొరకాయను కోస్తారు. ఈ చారిత్రక జమ్మిచెట్టు వద్దకు వెళ్లి కంకణాలు కట్టుకొని పూజలు నిర్వహిస్తారు.(HT Telugu)
దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను పంచుకుంటారు. దీని వెనక పురాణ కథలు ఉన్నాయి. శమీ పూజ చేసి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించడం వెనక అనేక కారణాలు ఉన్నాయి.
(4 / 5)
దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను పంచుకుంటారు. దీని వెనక పురాణ కథలు ఉన్నాయి. శమీ పూజ చేసి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించడం వెనక అనేక కారణాలు ఉన్నాయి.(HT Telugu)
జమ్మిని పూజిస్తే.. జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ముతారు. జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టును నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిదని అంటారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు.
(5 / 5)
జమ్మిని పూజిస్తే.. జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ముతారు. జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టును నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిదని అంటారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు.(HT Telugu)

    ఆర్టికల్ షేర్ చేయండి