తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krishna River Basin : భారీగా వరద, అల్మట్టి గేట్లు ఎత్తివేత - జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు...!

Krishna River Basin : భారీగా వరద, అల్మట్టి గేట్లు ఎత్తివేత - జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు...!

17 July 2024, 10:07 IST

Krishna River Basin Floods :కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చేరే అవకాశం ఉంది. 

  • Krishna River Basin Floods :కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చేరే అవకాశం ఉంది. 
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలో అతి ముఖ్యమైన అల్మట్టి డ్యామ్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
(1 / 6)

అల్మట్టి డ్యామ్ నుంచి మొత్తం 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.దీంతో దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది.
(2 / 6)

అల్మట్టి డ్యామ్ లో ఇప్పటివరకు 98.729 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సాయంత్రానికి 100 టీఎంసీలు లోపలికి చేరే అవకాశం ఉంది.
(3 / 6)

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం కొనసాగితే ఈ నెల చివరి వారం  నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
(4 / 6)

నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని జూరాలకు కృష్మమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. 
(5 / 6)

జూరాల వరకు వరద నీరు చేరితే ఆ తర్వాత శ్రీశైలం వైపు పరుగులు పెట్టనుంది. గత కొంతకాలంగా కృష్ణా బేసిన్ లో నీటి నిల్వలు ఆశించిన మేర లేవు. గత కొద్దిరోజులుగా ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో….. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం మొదలైంది. ఈ నెలాఖారులోగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకునే అవకాశం ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి