తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : దట్టమైన అడవిలో ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆధ్యాత్మికం.. ఈ కార్తీకమాసంలో ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకోండి!

AP Tourism : దట్టమైన అడవిలో ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆధ్యాత్మికం.. ఈ కార్తీకమాసంలో ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకోండి!

10 November 2024, 11:27 IST

AP Tourism : అందమైన జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య.. అత్యంత మహిమాన్వితమైన శివాల‌యం ఉంది. కార్తీకమాసంలో ఈ శైవక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. ఈ శివాలయం కడప జిల్లాలో ఉంది. ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు కనువిందు చేస్తాయి.

  • AP Tourism : అందమైన జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య.. అత్యంత మహిమాన్వితమైన శివాల‌యం ఉంది. కార్తీకమాసంలో ఈ శైవక్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. ఈ శివాలయం కడప జిల్లాలో ఉంది. ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు కనువిందు చేస్తాయి.
కడప జిల్లా చిట్వేలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. ఇది గుండాలకోనలో ఉంది. ఇక్కడ గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
(1 / 5)

ఇక్కడ గుండం పక్కనే గుహ వుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ కర్కాటకం ఒకొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తుంది. ఇక్కడి గుండంలో మునిగి దేవున్ని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకులు నమ్మకం. 
(2 / 5)

పార్వతీపరమేశ్వరుల నిలయమైన గుండాలకోన అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో కర్కాటకం రూపంలో సజీవంగా దర్శనమిచ్చే స్వామిని దర్శించుకోవడానికి కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో వెళుతుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు. గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం విశేషం. 
(3 / 5)

స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి 9 కిలోమీటర్లు అడవి బాటలో వెళ్లాలి. దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు ఉన్నాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిది.
(4 / 5)

శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి