తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bogatha Waterfall: తెలంగాణ నయాగరా అందాలు.. ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి మరీ!

Bogatha Waterfall: తెలంగాణ నయాగరా అందాలు.. ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి మరీ!

23 August 2024, 18:27 IST

Bogatha Waterfall: తెలంగాణ నయాగరాగా పిలిచే బోగత జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చీకుపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాజేడు వద్ద జల సవ్వడి నెలకొంది.

  • Bogatha Waterfall: తెలంగాణ నయాగరాగా పిలిచే బోగత జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చీకుపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాజేడు వద్ద జల సవ్వడి నెలకొంది.
తెలంగాణ నయాగరా అందాలను అస్వాదించడానికి సరైన సమయం ఇదే. బోగత జలపాతం వద్ద ప్రస్తుతం అందాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ పచ్చని దట్టమైన అడవి మధ్య ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. 
(1 / 6)
తెలంగాణ నయాగరా అందాలను అస్వాదించడానికి సరైన సమయం ఇదే. బోగత జలపాతం వద్ద ప్రస్తుతం అందాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ పచ్చని దట్టమైన అడవి మధ్య ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. 
బోగత వాటర్ ఫాల్స్ దగ్గర ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి మధ్యలో ఆ జల సవ్వడులను ఆస్వాదించడానికి పర్యాటకులు తరలివస్తారు. జలపాతంలో నీటి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈత కూడా కొట్టొచ్చు. కానీ.. ఈతకొట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. 
(2 / 6)
బోగత వాటర్ ఫాల్స్ దగ్గర ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి మధ్యలో ఆ జల సవ్వడులను ఆస్వాదించడానికి పర్యాటకులు తరలివస్తారు. జలపాతంలో నీటి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈత కూడా కొట్టొచ్చు. కానీ.. ఈతకొట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. (mulugu tourism )
బోగత జలపాతం వద్ద వ్యూ పాయింట్ కూడా నిర్మించారు. దీని నుంచి చూస్తే కనిపించే అందాలను మాటల్లో వర్ణించలేం.. రాతల్లో రాయలేం. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తేనే ఆ అనుభూతిని పొందొచ్చు. దట్టమైన పచ్చని అడవి అందాలు, తెల్లని నురగతో కనువిందు చేసే జలపాతం అందాలు కనిపిస్తాయి. 
(3 / 6)
బోగత జలపాతం వద్ద వ్యూ పాయింట్ కూడా నిర్మించారు. దీని నుంచి చూస్తే కనిపించే అందాలను మాటల్లో వర్ణించలేం.. రాతల్లో రాయలేం. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తేనే ఆ అనుభూతిని పొందొచ్చు. దట్టమైన పచ్చని అడవి అందాలు, తెల్లని నురగతో కనువిందు చేసే జలపాతం అందాలు కనిపిస్తాయి. (mulugu tourism )
బోగత జలపాతం అందాలను ఆస్వాదించడానికి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తారు. వరంగల్ వరకు ట్రైన్‌లో వచ్చి.. అక్కడి నుంచి హనుమకొండ వెళ్తే.. చాలా బస్సు అందుబాటులో ఉంటాయి. అవి ములుగు, ఏటూరునాగారం వరకు వస్తాయి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో వాజేడు చేరుకోవచ్చు. 
(4 / 6)
బోగత జలపాతం అందాలను ఆస్వాదించడానికి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తారు. వరంగల్ వరకు ట్రైన్‌లో వచ్చి.. అక్కడి నుంచి హనుమకొండ వెళ్తే.. చాలా బస్సు అందుబాటులో ఉంటాయి. అవి ములుగు, ఏటూరునాగారం వరకు వస్తాయి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో వాజేడు చేరుకోవచ్చు. (Mulugu tourism)
కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. వరంగల్ నుంచి ములుగు వరకు ప్రయాణం సాధారణంగా ఉన్నా.. ములుగు దాటిన తర్వాత ప్రకృతి ఒడిలో ప్రయాణం చేయొచ్చు. పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల గుండా ప్రయాణం సాగుతుంది. పచ్చని చెట్ల మధ్య ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది. 
(5 / 6)
కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. వరంగల్ నుంచి ములుగు వరకు ప్రయాణం సాధారణంగా ఉన్నా.. ములుగు దాటిన తర్వాత ప్రకృతి ఒడిలో ప్రయాణం చేయొచ్చు. పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల గుండా ప్రయాణం సాగుతుంది. పచ్చని చెట్ల మధ్య ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది. (Mulugu tourism )
ఇక్కడికి వస్తే.. కేవలం బోగత జలపాతం మాత్రమే కాదు.. ఒకసారి ట్రిప్ సెట్ చేసుకుంటే.. మేడారం, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, ఏటూరునాగారం ఫారెస్ట్‌ను కూడా సందర్శించవచ్చు. ఇవన్నీ వాజేడుకు దగ్గర్లోనే ఉంటాయి. ఇంకా ఎందుకు ఆలస్యం మరి.. వీలైనంత తొందరగా.. వాజేడు ట్రిప్ ప్లాన్ చేసుకొండి.
(6 / 6)
ఇక్కడికి వస్తే.. కేవలం బోగత జలపాతం మాత్రమే కాదు.. ఒకసారి ట్రిప్ సెట్ చేసుకుంటే.. మేడారం, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, ఏటూరునాగారం ఫారెస్ట్‌ను కూడా సందర్శించవచ్చు. ఇవన్నీ వాజేడుకు దగ్గర్లోనే ఉంటాయి. ఇంకా ఎందుకు ఆలస్యం మరి.. వీలైనంత తొందరగా.. వాజేడు ట్రిప్ ప్లాన్ చేసుకొండి.(Mulugu Tourism )

    ఆర్టికల్ షేర్ చేయండి