తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - ఈ నెలాఖరులోపే పూర్తి...!

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - ఈ నెలాఖరులోపే పూర్తి...!

15 December 2024, 9:38 IST

TG Indiramma Housing Scheme Survey : తెలంగాణలో 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈనెలాఖారులోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది.

  • TG Indiramma Housing Scheme Survey : తెలంగాణలో 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈనెలాఖారులోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సర్వే నడుస్తోంది.  
(1 / 8)

 ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి… వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు. సర్వేకు ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. 
(2 / 8)

గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. 
(3 / 8)

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న యాప్ సర్వేను ఈ నెలాఖారులోగా పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలోని అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేసింది. 
(4 / 8)

రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో  వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా… అధికారులు పని చేస్తున్నారు. 
(5 / 8)

లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తున్నారు, అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. 
(6 / 8)

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అయితే ఈనెలాఖారులోపు సర్వే పూర్తి కాకపోతే… జనవరి మొదటి వారంలోపైనా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
(7 / 8)

సర్వేలో భాగంగా… దరఖాస్తుదాడి ఫొటోతో పాటు ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిత్రాలను కూడా యాప్లో అప్ లోడ్ చేస్తున్నారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి