తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Ts Weather Updates : గరిష్ట ఉష్ణోగ్రతలు, ఆపై ఉక్కపోత - వచ్చే వారం తెలంగాణలో వర్షాలు..!

AP TS Weather Updates : గరిష్ట ఉష్ణోగ్రతలు, ఆపై ఉక్కపోత - వచ్చే వారం తెలంగాణలో వర్షాలు..!

04 May 2024, 12:37 IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఏకంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. వచ్చే వారంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఏకంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. వచ్చే వారంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం తర్వాత అయితే బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది.
(1 / 8)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం తర్వాత అయితే బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది.((photo source from https://unsplash.com/)
తెలంగాణలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరపికలను జారీ చేసింది.
(2 / 8)
తెలంగాణలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరపికలను జారీ చేసింది.(Photo Source @APSDMA Twitter)
మే 05, 06 తేదీల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఉకిరిబికిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడ గాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
(3 / 8)
మే 05, 06 తేదీల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఉకిరిబికిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడ గాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ((photo source from https://unsplash.com/)
శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ప్రకాశం జిల్లాలోని  అర్ధవీడులో 47.3°C, వైయస్సార్ జిల్లాలోని చిన్నచెప్పలిలో 47.2°C,నెల్లూరు జిల్లాలోని వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
(4 / 8)
శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ప్రకాశం జిల్లాలోని  అర్ధవీడులో 47.3°C, వైయస్సార్ జిల్లాలోని చిన్నచెప్పలిలో 47.2°C,నెల్లూరు జిల్లాలోని వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. (Photo Source @APSDMA Twitter)
మరోవైపు తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే6వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కట్ చేస్తే... పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని.... ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 
(5 / 8)
మరోవైపు తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే6వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కట్ చేస్తే... పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని.... ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ((photo source from https://unsplash.com/)
మే 6, 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ ఉంటుందని పేర్కొంది.  
(6 / 8)
మే 6, 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ ఉంటుందని పేర్కొంది.  ((photo source from https://unsplash.com/)
మే 10వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(7 / 8)
మే 10వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.((photo source from https://unsplash.com/)
ఇక గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలే కాకుండా… ఉక్కపోత కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
(8 / 8)
ఇక గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలే కాకుండా… ఉక్కపోత కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.((photo source from https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి