తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

TG Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

14 October 2024, 19:27 IST

TG Rains : తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోందని పేర్కొంది. 
(1 / 6)

అల్పపీడనం మంగళవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఆ తర్వాత రెండు రోజుల్లో మరింత ముందుకు కదిలి పశ్చిమ వాయువ్య  కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. 
(2 / 6)

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. 
(3 / 6)

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.  మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 
(4 / 6)

దక్షిణ ఏపీ తీరంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
(5 / 6)

హైదరాబాద్ లో వాతావరణం మేఘావృతమై ఉంది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌ నగర్‌, ప్రగతినగర్‌, ఆల్విన్‌ కాలనీ, పటాన్‌ చెరు, తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి