తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Rain Alert : తుపాన్ ఎఫెక్ట్ - తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు

Telangana Rain ALERT : తుపాన్ ఎఫెక్ట్ - తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు

28 November 2024, 14:18 IST

AP Telangana Weather News : తెలంగాణకు ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. రేపట్నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather News : తెలంగాణకు ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. రేపట్నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ తెలిపింది.  చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని అంచనా వేసింది.
(1 / 7)

రేపు ఉదయంలోపు తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. 
(2 / 7)

ఈ ప్రభావంతో 3 రోజులు ఏపీలోని దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు,రాయలసీమలో శుక్ర,శనివారాల్లోఅక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.శనివారం దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 7)

మరోవైపు తెలంగాణకు ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. తుఫాన్ ప్రభావంతో రేపట్నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(4 / 7)

రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక నవంబర్ 30వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(5 / 7)

డిసెంబర్ 1వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(6 / 7)

డిసెంబర్ 2వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జగనాం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మళ్లీ డిసెంబర్ 3,4 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని ఐఎండీ వివరించింది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి