తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : రామప్ప లేక్ వ్యూ రిసార్ట్స్.. ఇక్కడ సూర్యాస్తమయం చాలా స్పెషల్ గురూ!

Telangana Tourism : రామప్ప లేక్ వ్యూ రిసార్ట్స్.. ఇక్కడ సూర్యాస్తమయం చాలా స్పెషల్ గురూ!

24 September 2024, 16:24 IST

Telangana Tourism : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ టూరిజం సెప్టెంబర్ నెలలో అన్ని హరిత హోటళ్లలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. పబ్లిక్ హాలిడేస్ మినహా.. సోమవారం నుండి గురువారం వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

  • Telangana Tourism : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ టూరిజం సెప్టెంబర్ నెలలో అన్ని హరిత హోటళ్లలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. పబ్లిక్ హాలిడేస్ మినహా.. సోమవారం నుండి గురువారం వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ ఆడవుల్లో ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయతతో అలా కనువిందు చేసే ప్రాంతం రామప్ప చెరువు. ఓవైపు పచ్చని చెట్లతో ఎత్తైన కొండ.. మరోవైపు పాల నురగ లాంటి అందాలు పరుచుకున్న రామప్ప చెరువు. ఆ చెరువు అంచున్నే హరిత రిసార్ట్స్. ఈ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం భారీ ఆఫర్ ప్రకటించింది.
(1 / 6)
తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ ఆడవుల్లో ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయతతో అలా కనువిందు చేసే ప్రాంతం రామప్ప చెరువు. ఓవైపు పచ్చని చెట్లతో ఎత్తైన కొండ.. మరోవైపు పాల నురగ లాంటి అందాలు పరుచుకున్న రామప్ప చెరువు. ఆ చెరువు అంచున్నే హరిత రిసార్ట్స్. ఈ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం భారీ ఆఫర్ ప్రకటించింది.(Telangana Tourism )
ములుగు జిల్లా రామప్ప సరస్సు ఒడ్డున్నే లేక్ వ్యూ రిసార్ట్స్ ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదుల సదుపాయం ఉంది. ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. ఈ రిసార్ట్స్‌లో రెస్టారెంట్ కూడా ఉంది. పర్యాటకులకు ఏం కావాలన్నా.. అక్కడి సిబ్బంది సమకూరుస్తారు. 
(2 / 6)
ములుగు జిల్లా రామప్ప సరస్సు ఒడ్డున్నే లేక్ వ్యూ రిసార్ట్స్ ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదుల సదుపాయం ఉంది. ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. ఈ రిసార్ట్స్‌లో రెస్టారెంట్ కూడా ఉంది. పర్యాటకులకు ఏం కావాలన్నా.. అక్కడి సిబ్బంది సమకూరుస్తారు. (Telangana Tourism )
టారిఫ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ డీలక్స్ కొత్త గదులు రూ.1500, వారాంతంలో మాత్రం రూ. 1800. పాత ఏసీ గదులు రూ.1300, వారాంతంలో రూ.1500 ఉంటుంది. ఇక నాన్ ఏసీ గదులు పాతవి 900 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. వారాంతాల్లో మాత్రం రూ.1050 చెల్లించాలి.
(3 / 6)
టారిఫ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ డీలక్స్ కొత్త గదులు రూ.1500, వారాంతంలో మాత్రం రూ. 1800. పాత ఏసీ గదులు రూ.1300, వారాంతంలో రూ.1500 ఉంటుంది. ఇక నాన్ ఏసీ గదులు పాతవి 900 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. వారాంతాల్లో మాత్రం రూ.1050 చెల్లించాలి.(Telangana Tourism )
ఈ రిసార్ట్స్‌ను బుక్ చేసుకోవాలనుకునే పర్యాటకులు.. +91-9948100450 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలి. వారాంతాల్లో రిసార్ట్స్ కావాల్సిన వారు ముందుగా బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకుల రద్దీ కారణంగా రూమ్‌లు అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు.
(4 / 6)
ఈ రిసార్ట్స్‌ను బుక్ చేసుకోవాలనుకునే పర్యాటకులు.. +91-9948100450 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలి. వారాంతాల్లో రిసార్ట్స్ కావాల్సిన వారు ముందుగా బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకుల రద్దీ కారణంగా రూమ్‌లు అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు.(Telangana Tourism )
ఈ ప్రాంతానికి వస్తే.. ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, పాండవులగుట్ట. ఘన్‌పూర్ దేవాలయాలు, రామప్ప సరస్సు, లక్నవరం అందాలను ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా రామప్ప సరస్సు రిసార్ట్స్‌ నుంచి చూస్తే.. సూర్యాస్తమయం అద్బుతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో సరస్సు మీరు గోల్డెన్ రంగులో మెరుస్తూ కనిపిస్తుంది.
(5 / 6)
ఈ ప్రాంతానికి వస్తే.. ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, పాండవులగుట్ట. ఘన్‌పూర్ దేవాలయాలు, రామప్ప సరస్సు, లక్నవరం అందాలను ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా రామప్ప సరస్సు రిసార్ట్స్‌ నుంచి చూస్తే.. సూర్యాస్తమయం అద్బుతంగా కనిపిస్తుంది. ఆ సమయంలో సరస్సు మీరు గోల్డెన్ రంగులో మెరుస్తూ కనిపిస్తుంది.(Telangana Tourism )
ఈ రామప్ప రిసార్ట్స్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 210 కిలోమీటర్లు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ట్రైన్‌లో వచ్చి.. అక్కడి నుంచి బస్సులో రావొచ్చు. ములుగు వరకు బస్సులో వస్తే.. ఇక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కారులో రావాలనుకుంటే.. హనుమకొండ ములుగు రోడ్డు నుంచి నేరుగా రావొచ్చు.
(6 / 6)
ఈ రామప్ప రిసార్ట్స్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 210 కిలోమీటర్లు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ట్రైన్‌లో వచ్చి.. అక్కడి నుంచి బస్సులో రావొచ్చు. ములుగు వరకు బస్సులో వస్తే.. ఇక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కారులో రావాలనుకుంటే.. హనుమకొండ ములుగు రోడ్డు నుంచి నేరుగా రావొచ్చు.(Telangana Tourism )

    ఆర్టికల్ షేర్ చేయండి