తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vinakayaka Statues: దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం ఎక్కడో ఉన్నదో తెలుసా?

Vinakayaka Statues: దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం ఎక్కడో ఉన్నదో తెలుసా?

07 September 2024, 18:35 IST

Vinakayaka Statues: వినాయక చవితిని ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చరిత్రలో ఎంత మంది రాజులు, వారు కట్టించిన కట్టడాల వద్ద భారీ వినాయకుల విగ్రహాలను చెక్కించి నిలిపారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి అద్భుతమైన, పురాతన వినాయక విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని విగ్రహాల గురించి తెలుసుకుందాం.

  • Vinakayaka Statues: వినాయక చవితిని ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చరిత్రలో ఎంత మంది రాజులు, వారు కట్టించిన కట్టడాల వద్ద భారీ వినాయకుల విగ్రహాలను చెక్కించి నిలిపారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి అద్భుతమైన, పురాతన వినాయక విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని విగ్రహాల గురించి తెలుసుకుందాం.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు  హరగోపాల్ ప్రకారం శాతవాహన రాజు హాలుని సంకలనం గాథాసప్తశతిలో గణేశుని ప్రస్తావన ఉంది. కానీ గణేశుని శిల్పం 5వ శతాబ్దం వరకు దక్షిణాదికి రాలేదని చరిత్రకారులు తెలిపారు. రుగ్వేదంలోని 2వ మండలం 23వ సూక్తంలో చెప్పిన ‘బ్రహ్మణస్పతి’ గణపతేనని పెద్దల వ్యాఖ్యలు. గణపతి అనే పదం గణాల(రిపబ్లిక్స్) అధిపతిదేనని చెప్పేవారున్నారు. ఈ గణపతి ప్రస్తుత హిందూమతంలో, జైనం, బౌద్ధంలో కూడా ఉన్న ఆరాధ్యమూర్తి. 
(1 / 8)

మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామా శివారుల్లో ఉన్న అతి భారీ వినాయకుడు సుమారుగా 1,000 సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పంగా చరిత్రకారులు గుర్తించారు. ఈ విగ్రహాన్ని కందూరు చోళ రాజులూ చెక్కించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయపడుతున్నారు. ప్రతి వినాయక చవితి రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున, భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద గణపతి విగ్రహంగా ప్రసిద్ధి పొందింది. 
(2 / 8)

కళ్యాణ చాళుక్యుల కాలంలోనే క్రీస్తు శకం 11 శతాబ్దంలో చెక్కిన మరొక విగ్రహం, సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి గ్రామంలో ఉంది. ఆనాటి పాలకులు, హిందూ మతానికి, శిల్ప సౌందర్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఈ శిల్పాల్లో కనపడుతుంది.
(3 / 8)

సిద్దిపేట జిల్లాలోనే లభించిన మరొక పురాతన వినాయకుడి విగ్రహం బెక్కల్ లో ఉంది.  కాకతీయ కాలం 12శతాబ్దంలో ఈ విగ్రహాన్ని అప్పటి పాలకులు చెక్కించినట్టు  చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
(4 / 8)

భువనగిరి పట్టణం దగ్గర్లో ఉన్న పచ్చల సోమేశ్వరస్వామి ఆలయంలో ఉన్న మరొక గణపతి విగ్రహం కాకతీయ కాలంలో చెక్కిన నల్లరాతి శిల్పం.
(5 / 8)

నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలంలో ఉన్న అయిటిపాముల గ్రామంలో లభించిన అతి పురాతన విగ్రహం క్రీస్తు శకం 8వ, 9వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. ఇది రాష్ట్రకూట శైలి ద్విభుజుడని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
(6 / 8)

ప్రఖ్యాత చరిత్రకారుడు, తన తోటి చరిత్రకారులతో కలిసి కామారెడ్డి జిల్లాలోని వడ్లూరు గ్రామంలో పలు పురాతన గణపతి విగ్రహాలను సందర్శించారు.
(7 / 8)

కాకతీయ శైలికి సంబంధించిన మరొక అద్భుత విగ్రహాన్ని, సిద్దిపేట జిల్లాకి చెందిన యువ చరిత్ర కారుడు కొలిపాక శ్రీనివాస్ గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ వద్ద గుర్తించారు.  
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి