తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts New Secretariat : పాలనకు నయా సౌధం...కొత్త సచివాలయం - ఒక్కసారి ఈ ఫొటోలు చూస్తే....

TS New Secretariat : పాలనకు నయా సౌధం...కొత్త సచివాలయం - ఒక్కసారి ఈ ఫొటోలు చూస్తే....

23 April 2023, 10:37 IST

Telangana New Secretariat: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవన నిర్మాణ పనులు జరిగాయి. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు చూస్తే అదరహో అనాల్సిందే...

  • Telangana New Secretariat: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవన నిర్మాణ పనులు జరిగాయి. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు చూస్తే అదరహో అనాల్సిందే...
తెలంగాణ సచివాలయం ప్రారంభానికిఇప్పటికే తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  పనులు కూడా చివరి దశకు చేరాయి.
(1 / 8)
తెలంగాణ సచివాలయం ప్రారంభానికిఇప్పటికే తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  పనులు కూడా చివరి దశకు చేరాయి.(twiiter)
తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.
(2 / 8)
తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.(twiiter)
కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.
(3 / 8)
కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.(twitter)
ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి.
(4 / 8)
ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి.(twitter)
3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
(5 / 8)
3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం సిద్ధం చేశారు.. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.
(6 / 8)
ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం సిద్ధం చేశారు.. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.
 సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్‌ తదితరాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు.
(7 / 8)
 సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్‌ తదితరాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు.
సచివాలయ భవనాన్ని 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను భవనం చుట్టూ ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు
(8 / 8)
సచివాలయ భవనాన్ని 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను భవనం చుట్టూ ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి