తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : 3 రోజులు బలమైన ఉపరితల గాలులు - ఇవాళ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు..!

AP TG Weather Updates : 3 రోజులు బలమైన ఉపరితల గాలులు - ఇవాళ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు..!

03 August 2024, 6:01 IST

AP Telangana Weather Updates :ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  పేర్కొంది . ఆయా ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather Updates :ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  పేర్కొంది . ఆయా ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(1 / 6)

ఇవాళ ఏపీలో(ఆగస్టు 03)ని అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(2 / 6)

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు , బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 6)

తెలంగాణలో చూస్తే ఈ మూడు రోజులు స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. 30 -40 కిమీ వేగంతో ఈ గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ ఉదయం 08.30 లోపు పలు జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 
(4 / 6)

ఇవాళ ఉదయం 08. 30 నుంచి రేపు ఉదయం 08.30 గంటల వరకు చూస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(5 / 6)

రేపు ఉదయం 08. 30 తర్వాత నుంచి తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆగస్టు 08వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి