తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Weather Updates : మండుతున్న ఎండలు - ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

TG Weather Updates : మండుతున్న ఎండలు - ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

29 May 2024, 10:26 IST

Telangana AP Weather Updates : తెలంగాణలో మళ్లీ ఎండలు దంచుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • Telangana AP Weather Updates : తెలంగాణలో మళ్లీ ఎండలు దంచుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి.  ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
(1 / 6)
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి.  ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. (Image Source Unshplash.com)
రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 
(2 / 6)
రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. (Image Source @APSDMA Twitter)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం… ఇవాళ, రేపు(మే 29, 30) రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదు
(3 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం… ఇవాళ, రేపు(మే 29, 30) రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదు(Image Source @APSDMA Twitter)
మంగళవారం(మే 28) ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి, ఇక ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 44.3, నిర్మల్‌ జిల్లా కుభీర్‌లో 43.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 
(4 / 6)
మంగళవారం(మే 28) ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి, ఇక ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 44.3, నిర్మల్‌ జిల్లా కుభీర్‌లో 43.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. (Image Source Unshplash.com)
ఇదిలా ఉంటే…. మరోసారి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మే 31వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
(5 / 6)
ఇదిలా ఉంటే…. మరోసారి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మే 31వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దేశవ్యాప్తంగా జూన్ లో సగటు వర్షపాతం సాధారణంగా నమోదవడానికి అవకాశం ఉందని…. కేరళలో ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితి అనుకూలంగా ఉందని వెల్లడించింది.  
(6 / 6)
ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దేశవ్యాప్తంగా జూన్ లో సగటు వర్షపాతం సాధారణంగా నమోదవడానికి అవకాశం ఉందని…. కేరళలో ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితి అనుకూలంగా ఉందని వెల్లడించింది.  (Image Source @APSDMA Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి