తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Govt Praja Palana Applications : 'ప్రజా పాలన' దరఖాస్తులో వివరాలను తప్పుగా ఇచ్చారా..? మీ కోసమే ఈ అప్డేట్

TS Govt Praja Palana Applications : 'ప్రజా పాలన' దరఖాస్తులో వివరాలను తప్పుగా ఇచ్చారా..? మీ కోసమే ఈ అప్డేట్

02 February 2024, 19:20 IST

Telangana Govt Praja Palana Applications Updates : ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. ఇటీవలే స్వీకరించిన దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా డూప్లికేట్ అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. 

  • Telangana Govt Praja Palana Applications Updates : ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. ఇటీవలే స్వీకరించిన దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా డూప్లికేట్ అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. 
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ ను స్వీకరించింది.
(1 / 5)
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ ను స్వీకరించింది.(TS CMO Twitter)
ఈ గ్యారంటీ స్కీమ్ లకు సంబంధించి మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డును కూడా పూర్తి చేశారు. అయితే ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
(2 / 5)
ఈ గ్యారంటీ స్కీమ్ లకు సంబంధించి మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డును కూడా పూర్తి చేశారు. అయితే ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.(https://prajapalana.telangana.gov.in/)
మొత్తం దరఖాస్తుల్లో  2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉండటంతో పాటు, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. 
(3 / 5)
మొత్తం దరఖాస్తుల్లో  2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉండటంతో పాటు, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. (https://prajapalana.telangana.gov.in/)
 ప్రజాపాలన దరఖాస్తులపై తాజాగా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి… డూప్లికేట్ అప్లికేషన్ల విషయంపై కూడా స్పందించారు. వీటిని మరోసారి పరిశీలించాలని… దరఖాస్తుదారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారిని మిస్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
(4 / 5)
 ప్రజాపాలన దరఖాస్తులపై తాజాగా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి… డూప్లికేట్ అప్లికేషన్ల విషయంపై కూడా స్పందించారు. వీటిని మరోసారి పరిశీలించాలని… దరఖాస్తుదారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారిని మిస్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు.(https://prajapalana.telangana.gov.in/)
ముఖ్యంత్రి ఆదేశాలతో డూప్లికేట్ అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు అధికారులు. దరఖాస్తుదారులను సంప్రదించి క్రాస్ చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా అర్హులైన వారు కూడా పథకాల ఎంపిక జాబితాలో చేరిపోనున్నారు.
(5 / 5)
ముఖ్యంత్రి ఆదేశాలతో డూప్లికేట్ అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు అధికారులు. దరఖాస్తుదారులను సంప్రదించి క్రాస్ చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా అర్హులైన వారు కూడా పథకాల ఎంపిక జాబితాలో చేరిపోనున్నారు.(https://prajapalana.telangana.gov.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి