తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Govt Health Cards Updates : 'త్వరలోనే డిజిటల్‌ హెల్త్ కార్డులు' - ఆరోగ్య బీమా స్కీమ్ తాజా అప్డేట్ ఇదే

TS Govt Health Cards Updates : 'త్వరలోనే డిజిటల్‌ హెల్త్ కార్డులు' - ఆరోగ్య బీమా స్కీమ్ తాజా అప్డేట్ ఇదే

18 January 2024, 19:55 IST

Telangana  Govt Digital Health Cards Updates : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొత్త పథకాలను పట్టాలెక్కించే పనిలో పడింది. ఇప్పటికే స్కీమ్ ల అమలుకు సంబంధించి కసరత్తు చేస్తుండగా… ప్రజారోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని చెప్పారు.

  • Telangana  Govt Digital Health Cards Updates : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొత్త పథకాలను పట్టాలెక్కించే పనిలో పడింది. ఇప్పటికే స్కీమ్ ల అమలుకు సంబంధించి కసరత్తు చేస్తుండగా… ప్రజారోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని చెప్పారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ బీమాను రూ. 10 లక్షలకు పెంచింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పేరుతో దీన్ని అమలు చేస్తోంది. 
(1 / 5)
తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ బీమాను రూ. 10 లక్షలకు పెంచింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పేరుతో దీన్ని అమలు చేస్తోంది. (Congress Twitter)
 గతంలో ఆరోగ్య శ్రీ హెల్త్ బీమా రూ. 5 లక్షల వరకే  ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 
(2 / 5)
 గతంలో ఆరోగ్య శ్రీ హెల్త్ బీమా రూ. 5 లక్షల వరకే  ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. (https://rajivaarogyasri.telangana.gov.in/)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కార్డులను కూడా పంపిణీ చేశారు. అప్పట్నుంచి… ఇవాళ్టి వరకు కొత్త కార్డులను మంజూరు చేయలేదు. 
(3 / 5)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కార్డులను కూడా పంపిణీ చేశారు. అప్పట్నుంచి… ఇవాళ్టి వరకు కొత్త కార్డులను మంజూరు చేయలేదు. (https://rajivaarogyasri.telangana.gov.in/)
ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం... కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తోంది. ఇదే విషయంపై దావోస్ పర్యటనలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై మాట్లాడిన సీఎం రేవంత్... తెలంగాణలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. 
(4 / 5)
ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం... కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తోంది. ఇదే విషయంపై దావోస్ పర్యటనలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై మాట్లాడిన సీఎం రేవంత్... తెలంగాణలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. (https://rajivaarogyasri.telangana.gov.in/)
ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తంగా చూస్తే.... త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
(5 / 5)
ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తంగా చూస్తే.... త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.(https://rajivaarogyasri.telangana.gov.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి