తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

20 June 2024, 15:46 IST

AP Telangana Rains Updates : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……

  • AP Telangana Rains Updates : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని అనుకుని తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)

ఏపీలో ఇవాళ,(జూన్ 20) రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అంచనా వేసింది. జూన్ 24వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
(3 / 6)
ఏపీలో ఇవాళ,(జూన్ 20) రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అంచనా వేసింది. జూన్ 24వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.(@APSDMA Twitter)
(జూన్ 20) శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(4 / 6)

ఇక తెలంగాణలో రాగల నాలుగైదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం(జూన్ 20) నుంచి శుక్రవారం ఉదయం(8.30 గంటల) వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
ఇక తెలంగాణలో రాగల నాలుగైదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం(జూన్ 20) నుంచి శుక్రవారం ఉదయం(8.30 గంటల) వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(@APSDMA Twitter)
ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచింది.  ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. జూన్ 27వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(6 / 6)
ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచింది.  ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. జూన్ 27వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.(@APSDMA Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి