తెలుగు న్యూస్  /  ఫోటో  /  T20 World Cup 2024: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్.. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు

T20 World Cup 2024: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్.. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు

04 June 2024, 7:11 IST

T20 World Cup 2024: సౌతాఫ్రికా పేస్ బౌలర్ ఎన్రిచ్ నోక్యా టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. సోమవారం (జూన్ 3) శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.

  • T20 World Cup 2024: సౌతాఫ్రికా పేస్ బౌలర్ ఎన్రిచ్ నోక్యా టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. సోమవారం (జూన్ 3) శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో సౌతాఫ్రికా బోణీ చేసింది. శ్రీలంకను 6 వికెట్లతో చిత్తు చేసింది. న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 7 పరుగులు 4 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ప్లేయర్స్ లో మరో ముగ్గురితో కలిసి టాప్ లో ఉన్నాడు.
(1 / 5)

T20 World Cup 2024: నోక్యా ధాటికి శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. అతడు కుశల్ మెండిస్, కామిందు మెండిస్, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్ లాంటి కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇంతకుముందు మరో ముగ్గురు బౌలర్లు కూడా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇవ్వగా.. అందులో ఇద్దరు శ్రీలంక బౌలర్లే ఉన్నారు.
(2 / 5)

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డును నోక్యా సమం చేశాడు. అంతకుముందు అజంత మెండిస్, వానిందు హసరంగ, మహ్మదుల్లా కూడా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి రికార్డు క్రియేట్ చేశారు.
(3 / 5)

T20 World Cup 2024: శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ 2012 టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వేపై 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడు. ఇక 2014 టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ బౌలర్ మహ్మదుల్లా ఆఫ్ఘనిస్థాన్ పై 4 ఓవర్లలో 8 రన్స్ ఇచ్చాడు. మరోవైపు శ్రీలంక ప్రస్తుత కెప్టెన్ హసరంగా 2022 టీ20 వరల్డ్ కప్ లో యూఏఈపై 4 ఓవర్లలో 8 రన్స్ ఇచ్చాడు.
(4 / 5)

T20 World Cup 2024: నోక్యాతోపాటు మరో సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మాన్ కూడా రాణించడంతో శ్రీలంక టీ20 క్రికెట్ లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గతంలో ఇండియాపై 82 రన్స్ చేయగా.. ఇప్పుడు 77 పరుగులకే కుప్పకూలింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి