తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sun Tan: చర్మం టానింగ్ పోవాలంటే ఇంట్లో ఉన్న ఈ పదార్థాలను ఇలా వాడండి

Sun tan: చర్మం టానింగ్ పోవాలంటే ఇంట్లో ఉన్న ఈ పదార్థాలను ఇలా వాడండి

01 May 2024, 17:34 IST

Sun tan: మండే ఎండల్లో తిరిగితే సన్ టాన్ చర్మానికి పట్టేస్తుంది. అంటే చర్మం నల్లగా మారిపోతుంది. ఇంట్లో దొరికిన కొన్ని పదార్థాలతోనే చర్మానికి పట్టిన మురికిని, నలుపుదనాన్ని తగ్గించుకోవచ్చు.

  • Sun tan: మండే ఎండల్లో తిరిగితే సన్ టాన్ చర్మానికి పట్టేస్తుంది. అంటే చర్మం నల్లగా మారిపోతుంది. ఇంట్లో దొరికిన కొన్ని పదార్థాలతోనే చర్మానికి పట్టిన మురికిని, నలుపుదనాన్ని తగ్గించుకోవచ్చు.
ఎండ వేడిమి వల్ల చర్మానికి సన్ టాన్ పట్టేస్తుంది. ఆ నలుపుదనాన్ని పోగొట్టుకోవడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరాగాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే టానింగ్ పొగొట్టుకోవచ్చు.
(1 / 6)

శెనగపప్పును ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్టును  ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు స్నానానికి ముందు కొద్దిగా పచ్చిపాలతో పాటు శెనగపప్పు పేస్టును కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని శరీరమంతా 25-20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత మసాజ్ చేసి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా వాడితే టాన్ పోతుంది.
(2 / 6)

1 టీస్పూన్ ఓట్ మీల్‌ను, 1 టీస్పూన్ పెరుగుతో కలపండి. ఇది ఫేస్ స్క్రబ్‌లా పనిచేస్తుంది. ముఖాన్ని నీటిలో నానబెట్టి తర్వాత అప్లై చేయాలి. ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత పావుగంట పాటూ అలాగే ఉంచాలి. చివరగా నీళ్లతో ముఖాన్ని కడిగి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.  
(3 / 6)

పుచ్చకాయ పండ్ల రసం మీ ముఖంపై టాన్‌ను శుభ్రపరచడంలో  సహాయపడుతుంది. పుచ్చకాయ రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి,  2 టీస్పూన్ల పుచ్చకాయ పేస్ట్ లో‌ 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.  
(4 / 6)

కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా చర్మంపై కాఫీని ఉపయోగించడం వల్ల ఫ్రీరాడికల్స్, ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. 1 టీస్పూన్ కాఫీ పొడిని, 1 టీస్పూన్ తేనెతో కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి.  
(5 / 6)

పసుపు పొడిని చిన్న గిన్నెలో వేయాలి. ఇప్పుడు కాఫీ పొడి, తేనె, పాలు కూడా పసుపులో వేసి కలపాలి. అలా తయారైన పేస్ట్ ను ముఖం, చేతులు, పాదాలకు అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిపోయే వరకు 10-15 నిమిషాలు ఉంచండి. తర్వాత నీళ్లు చల్లి మరోసారి చర్మాన్ని మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. కాబట్టి టాన్ పోతుంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి