తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sumit Nagal Australian Open: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్ సుమీత్ నాగల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో శుభారంభం

Sumit Nagal Australian Open: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్ సుమీత్ నాగల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో శుభారంభం

16 January 2024, 19:25 IST

Sumit Nagal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమీత్ నాగల్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో 6-4, 6-2. 7-6 (7/5) తేడాతో 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‍పై విజయం సాధించాడు. వివరాలివే..

  • Sumit Nagal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమీత్ నాగల్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో 6-4, 6-2. 7-6 (7/5) తేడాతో 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‍పై విజయం సాధించాడు. వివరాలివే..
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గ్రాండ్‍‍స్లామ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమీత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్లలో ఓ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన తొలి భారత పురుష ప్లేయర్‌గా నిలిచాడు. 
(1 / 5)
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గ్రాండ్‍‍స్లామ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమీత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్లలో ఓ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన తొలి భారత పురుష ప్లేయర్‌గా నిలిచాడు. (REUTERS)
ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమీత్ నాగల్ 6-4, 6-2, 7-6 (7/5) తేడాతో 31వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)పై నేడు (జనవరి 16) విజయం సాధించాడు. రెండో రౌండ్‍లో అడుగుపెట్టాడు. 
(2 / 5)
ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమీత్ నాగల్ 6-4, 6-2, 7-6 (7/5) తేడాతో 31వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)పై నేడు (జనవరి 16) విజయం సాధించాడు. రెండో రౌండ్‍లో అడుగుపెట్టాడు. (AP)
ప్రపంచ 27వ ర్యాంకర్ బబ్లిక్‍ను అన్‍సీడెడ్ సుమీత్ నాగల్ వరుస సెట్లలో మట్టికరిపించాడు. తొలి రెండు సెట్లను సునాయాసంగా దక్కించుకన్నాడు సుమీత్. మూడో సెట్ టై బ్రేకర్‌కు వెళ్లగా.. పట్టువదలకుండా పోరాడాడు. విజయం సాధించాడు. 
(3 / 5)
ప్రపంచ 27వ ర్యాంకర్ బబ్లిక్‍ను అన్‍సీడెడ్ సుమీత్ నాగల్ వరుస సెట్లలో మట్టికరిపించాడు. తొలి రెండు సెట్లను సునాయాసంగా దక్కించుకన్నాడు సుమీత్. మూడో సెట్ టై బ్రేకర్‌కు వెళ్లగా.. పట్టువదలకుండా పోరాడాడు. విజయం సాధించాడు. (REUTERS)
1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్‍ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో టాప్ సీడ్‍ మాట్స్ విలాండర్‌పై భారత దిగ్గజ ప్లేయర్ రమేశ్ కృష్ణన్ విజయం సాధించారు. ఆయన తర్వాత, ఓ గ్రాండ్‍స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌పై గెలిచిన భారత పురుష ప్లేయర్‌గా సుమీత్ నాగల్ నిలిచాడు. 
(4 / 5)
1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్‍ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో టాప్ సీడ్‍ మాట్స్ విలాండర్‌పై భారత దిగ్గజ ప్లేయర్ రమేశ్ కృష్ణన్ విజయం సాధించారు. ఆయన తర్వాత, ఓ గ్రాండ్‍స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌పై గెలిచిన భారత పురుష ప్లేయర్‌గా సుమీత్ నాగల్ నిలిచాడు. (AP)
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‍లో చైనా ప్లేయర్ షాంగ్ జున్‍చెంగ్‍తో సుమీత్ నాగల్ తలపడనున్నాడు. గురువారం (జనవరి 18) ఈ మ్యాచ్ జరగనుంది. 
(5 / 5)
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‍లో చైనా ప్లేయర్ షాంగ్ జున్‍చెంగ్‍తో సుమీత్ నాగల్ తలపడనున్నాడు. గురువారం (జనవరి 18) ఈ మ్యాచ్ జరగనుంది. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి