తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన శివాలయం ఇది.. శ్రీ క్షీరారామలింగేశ్వర క్షేత్రం విశేషాలు

AP Tourism : జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన శివాలయం ఇది.. శ్రీ క్షీరారామలింగేశ్వర క్షేత్రం విశేషాలు

23 November 2024, 14:55 IST

AP Tourism : పంచారామాలలో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర ఆలయం. ఈ దేవాలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పార్వతీ సమేతుడైన శ్రీ క్షీరారామలింగేశ్వరుడు.. బ్రహ్మాది సకలదేవతలతో కొలువు దీరిన పుణ్యక్షేత్రం ఇది. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా ఈ క్షేత్రాన్ని సందర్శించాలని పెద్దలు చెబుతుంటారు.

  • AP Tourism : పంచారామాలలో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర ఆలయం. ఈ దేవాలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పార్వతీ సమేతుడైన శ్రీ క్షీరారామలింగేశ్వరుడు.. బ్రహ్మాది సకలదేవతలతో కొలువు దీరిన పుణ్యక్షేత్రం ఇది. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా ఈ క్షేత్రాన్ని సందర్శించాలని పెద్దలు చెబుతుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలలో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్ధనులు, బ్రహ్మ సరస్వతులు, విఘ్నేశ్వర, సుబ్రమణ్యేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రాది సకల దేవతలతో, మహర్షులతో శ్రీ క్షీరారామేశ్వరుడు కొలువుతీరాడు. ఈ క్షేత్రాన్ని పరమ పుణ్యధామంగా మన పురాణాలు చెబుతాయి.
(1 / 6)

శ్రీశైలంలో నూరు పక్షాలు, గయలో 80 గడియలు, కేదారేశ్వరంలో వంద సంవత్సరాలు, వారణాసిలో ఒక సంవత్సరం, రామేశ్వరంలో వెయ్యేళ్లు, హరిద్వార్‌లో 8 సంవత్సరాలు భక్తితో నివసిస్తే కలిగే ఫలం.. ఈ క్షీరారామంలో ఒక నిద్రతో లభిస్తుంది. శ్రీ క్షీరారామలింగేశ్వరుని దర్శనంతో బ్రహ్మహత్యాది సమస్త పాపాలు పోతాయని.. శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠిస్తూ ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని గురించి తెలిపాడు.
(2 / 6)

క్షీరారామం అంటే పాల కొలను అని అర్ధం. పూర్వం కౌశికుడనే ఋషి కుమారుడు ఉపమన్యువు శంకరుని ఆర్తితో పాల కోసం ప్రార్ధించాడు. పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఒక సరోవరంను నిర్మించి, క్షీరసాగరం నుండి పాలను ఆకర్షించి.. ఋషి కుమారుడికి అందిచాడు. అందుచే ఈ ప్రాంతాన్ని పాలకొలను, పాలకొల్లు, క్షీరపురం అంటారు. 
(3 / 6)

ఈ ఆలయ రాజ గోపురం 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. నయన మనోహరంగా కన్పిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం చాళుక్య భీముని కాలంలో జరిగింది. ఈ గోపురం రెడ్డి రాజుల కాలంలో నిర్మించారనే వాదన కూడా ఉంది. ఈ గోపురాన్ని నిర్మించడానికే దక్షిణంగా రామగుండం చెరువు తవ్వారనే ప్రచారం ఉంది.
(4 / 6)

మరొక విశేషం ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో, సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలు రాజగోపురం రెండవ అంతస్తు నుండి క్రమంగా ప్రాకారాల మథ్యనుండి స్వామివారిపై ప్రసరిస్తాయి. శ్రీ క్షీరారామలింగేశ్వరుని ఆలయంలోకి అడుగుపెడితేనే ఏదో ఒక దేవతాలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు. దానికి కారణం ఆలయం నిండా ఎందరో దేవీ, దేవతామూర్తుల ఉపాలయాలు, ఆలయ స్థంభాలపై అందంగా చెక్కిన పురాణ గాథా శిల్పాలు కనిపిస్తాయి.
(5 / 6)

ఈ క్షేత్రము సర్వదేవతానిలయం. శివకేశవాద్వైతమునకు ప్రతీక. కాబట్టే.. సంవత్సరం పొడవునా నిత్యకళ్యాణము పచ్చతోరణమై ప్రతినెలలోనూ.. ప్రతిరోజు ఏవో ఉత్సవాలు జరుగుతూనే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఉగాది, చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు రథోత్సవము, వినాయకచవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి కార్తికమాస అభిషేకాలు, జ్వాలాతోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, లక్ష బిల్వార్చనలు, కోటిబిల్వార్చనలు, సహస్రఘటాభిషేకాలు.. ఇవే కాకుండా ఆయా సందర్భాల్లో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇలా ఎన్నో వింతలూ విశేషాలకి నెలవైన క్షీరారామాన్ని ఒకసారైనా దర్శించుకోవడం ఉత్తమం.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి