తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : 60 అడుగుల ఎత్తులో శివ లింగం.. 'కుమారారామం' దర్శనం సర్వపాపహరణం!

AP Tourism : 60 అడుగుల ఎత్తులో శివ లింగం.. 'కుమారారామం' దర్శనం సర్వపాపహరణం!

25 November 2024, 18:26 IST

AP Tourism : శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. ఆయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. శివుడు పశుపతిగా, లింగం రూపంలోను సింధు నాగరికత కాలంలోనే పూజలందుకున్నాడు. అలాంటి మహాశివుడు కొలువైన పంచారామా క్షేత్రాలలో కుమారారామం ఒకటి.

  • AP Tourism : శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. ఆయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. శివుడు పశుపతిగా, లింగం రూపంలోను సింధు నాగరికత కాలంలోనే పూజలందుకున్నాడు. అలాంటి మహాశివుడు కొలువైన పంచారామా క్షేత్రాలలో కుమారారామం ఒకటి.
రాజమహేంద్రవరం నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో.. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కుమారారామం ఉంది. ఇది పంచరామాల్లో చివరిది, అయిదవది. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో.. రెండంతస్తుల మండపంగా ఉంటుంది. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఆయన ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు. 
(1 / 6)

ఈ ఆలయంలోని శివుడిని 'కుమార భీమేశ్వరుడు'అని పిలుస్తారు. ఆయన 'వామదేవ' స్వరూపుడు. యోగ లింగంగా శివుడు వెలసిన ఈ క్షేత్రం సామర్లకోటలో అంతర్భాగంగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఆవల దిక్కున ఉంది. అమ్మవారి పేరు బాలాత్రిపురా సుందరి. ఈ ఆలయాన్ని కూడా తూర్పు చాళుక్యులు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. రెండు అంతస్థులు కలిగిన ఈ ఆలయంలో శివ లింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో ఉభయ సంధ్యల్లో సూర్య కిరణాలు నేరుగా పడడం విశేషం. ఈ ఆవరణలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహరమే కాకుండా, అభీష్ట సిద్ధులు కలుగుతాయని భక్తుల నమ్మకం.
(2 / 6)

కోటగోడలాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండో ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతిస్థంభము ఉన్నాయి. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. 
(3 / 6)

విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే.. మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.
(4 / 6)

నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు.. శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ ప్రచారంలో ఉంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశీనుడై ఉంటాడు. ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం పైకప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేస్తారు.
(5 / 6)

శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి.. బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి