తెలుగు న్యూస్  /  ఫోటో  /  Feeling Angry: అప్పుడప్పుడు కోపం కూడా ఆరోగ్యకరమే, ఎందుకో తెలుసా?

Feeling Angry: అప్పుడప్పుడు కోపం కూడా ఆరోగ్యకరమే, ఎందుకో తెలుసా?

22 March 2024, 10:49 IST

కోపం ఒక రకమైన భావోద్వేగం. అయితే ఇది చేసే మేలు తక్కువే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ఏఏ సందర్భాల్లో కోపం మేలు చేస్తుందో తెలుసుకోండి.

కోపం ఒక రకమైన భావోద్వేగం. అయితే ఇది చేసే మేలు తక్కువే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ఏఏ సందర్భాల్లో కోపం మేలు చేస్తుందో తెలుసుకోండి.
మనిషికి ఉన్న భావోద్వేగాలలో  కోపం కూడా ఒకటి,  మనసుకు నచ్చనిది జరిగినప్పుడు ఎవరికైనా సర్రున కోపం వచ్చేస్తుంది. కొందరిలో మాత్రం కోపం హద్దులు దాటుతుంది. ఇలాంటి సమయంలోనే జరగరాని నష్టాలు జరుగుతాయి. ఆ రేంజ్ కోపం రావడం మంచిది కాదు, కానీ ఎంతో కొంత కోపం రావడం మాత్రం మంచిదే. 
(1 / 6)
మనిషికి ఉన్న భావోద్వేగాలలో  కోపం కూడా ఒకటి,  మనసుకు నచ్చనిది జరిగినప్పుడు ఎవరికైనా సర్రున కోపం వచ్చేస్తుంది. కొందరిలో మాత్రం కోపం హద్దులు దాటుతుంది. ఇలాంటి సమయంలోనే జరగరాని నష్టాలు జరుగుతాయి. ఆ రేంజ్ కోపం రావడం మంచిది కాదు, కానీ ఎంతో కొంత కోపం రావడం మాత్రం మంచిదే. (Unsplash)
ఎక్కువ సహనం ఒక్కోసారి ఎదుటివారి దగ్గర మనల్ని చులకన చేస్తుంది. మీకు నచ్చని విషయాన్ని వ్యక్తీకరించడానికి కోపం చాలా అవసరం. 
(2 / 6)
ఎక్కువ సహనం ఒక్కోసారి ఎదుటివారి దగ్గర మనల్ని చులకన చేస్తుంది. మీకు నచ్చని విషయాన్ని వ్యక్తీకరించడానికి కోపం చాలా అవసరం. (Unsplash)
కొన్ని సార్లు మనసు తేలికపడాలంటే త్వరగా మనుసులో ఉన్న బాధని, అసహనాన్ని బయటపెట్టేయాలి. వాటిని బయటపెట్టాలంటే కోపం ఒక్కటే దారి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(3 / 6)
కొన్ని సార్లు మనసు తేలికపడాలంటే త్వరగా మనుసులో ఉన్న బాధని, అసహనాన్ని బయటపెట్టేయాలి. వాటిని బయటపెట్టాలంటే కోపం ఒక్కటే దారి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.(Unsplash)
ఎదుటివారు తమ హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు కచ్చితంగా మీ కోపాన్ని చూపించాలి. లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
(4 / 6)
ఎదుటివారు తమ హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు కచ్చితంగా మీ కోపాన్ని చూపించాలి. లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది.(Unsplash)
కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలోనే వ్యక్తపరచాలి.  కేవలం నోటితోనే కోపాన్ని వ్యక్తపరచాలి కానీ ఎదుటి వారిని కొట్టేదాకా వెళ్లకూడదు. అది కూడా సవ్యమైన పదజాలంతోనే మీ కోపాప్ని ఎదుటివారిపై చూపించాలి. అప్పుడే ఆరోగ్యకరం. 
(5 / 6)
కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలోనే వ్యక్తపరచాలి.  కేవలం నోటితోనే కోపాన్ని వ్యక్తపరచాలి కానీ ఎదుటి వారిని కొట్టేదాకా వెళ్లకూడదు. అది కూడా సవ్యమైన పదజాలంతోనే మీ కోపాప్ని ఎదుటివారిపై చూపించాలి. అప్పుడే ఆరోగ్యకరం. (Unsplash)
కోపాన్ని సరైన పద్ధతిలో వ్యక్తికరిస్తే అది కూడా ఆరోగ్యకరమైన భావోద్వేగమే.
(6 / 6)
కోపాన్ని సరైన పద్ధతిలో వ్యక్తికరిస్తే అది కూడా ఆరోగ్యకరమైన భావోద్వేగమే.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి