తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్ నిస్సంక

09 February 2024, 19:21 IST

Pathum Nissanka Records: శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో అతడు ద్విశతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడు రికార్డులను బద్దలుకొట్టాడు.

  • Pathum Nissanka Records: శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో అతడు ద్విశతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడు రికార్డులను బద్దలుకొట్టాడు.
అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. పల్లెకెలె వేదికగా నేడు (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపాడు. 
(1 / 5)
అఫ్గానిస్థాన్‍తో తొలి వన్డేలో శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. పల్లెకెలె వేదికగా నేడు (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపాడు. (AFP)
అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా పాతుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. 
(2 / 5)
అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా పాతుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. (AFP)
ఈ మ్యాచ్‍లో 139 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిన నిస్సంక అజేయంగా 210 పరుగులు చేశాడు. 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కుకు చేరాడు. 
(3 / 5)
ఈ మ్యాచ్‍లో 139 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిన నిస్సంక అజేయంగా 210 పరుగులు చేశాడు. 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కుకు చేరాడు. (AFP)
శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటి వరకు సనత్ జయసూర్య (189) పేరిట ఉండేది. దాన్ని నిస్సంక ఇప్పుడు ద్విశతకంతో బద్దలుకొట్టాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
(4 / 5)
శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటి వరకు సనత్ జయసూర్య (189) పేరిట ఉండేది. దాన్ని నిస్సంక ఇప్పుడు ద్విశతకంతో బద్దలుకొట్టాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. (AFP)
పాతుమ్ నిస్సంక ద్విశతకంతో చెలరేగడంతో ఈ తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏకంగా 50 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది. 
(5 / 5)
పాతుమ్ నిస్సంక ద్విశతకంతో చెలరేగడంతో ఈ తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏకంగా 50 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి