తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siddharth Kaul Retirement: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోవడంతో రిటైరైన టీమిండియా పేస్ బౌలర్

Siddharth Kaul Retirement: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోవడంతో రిటైరైన టీమిండియా పేస్ బౌలర్

28 November 2024, 21:10 IST

Siddharth Kaul Retirement: సిద్ధార్థ్ కౌల్ రిటైరయ్యాడు. ఒకప్పుడు టీమిండియా తరఫున ఆడిన ఈ వెటరన్ పేస్ బౌలర్.. రూ.40 లక్షల బేస్ ప్రైస్ ఉన్నప్పటికీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు.

  • Siddharth Kaul Retirement: సిద్ధార్థ్ కౌల్ రిటైరయ్యాడు. ఒకప్పుడు టీమిండియా తరఫున ఆడిన ఈ వెటరన్ పేస్ బౌలర్.. రూ.40 లక్షల బేస్ ప్రైస్ ఉన్నప్పటికీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు.
Siddharth Kaul Retirement: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో సిద్ధార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గురువారం(నవంబర్ 28) సిద్ధార్థ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఈ స్టార్ పేసర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 
(1 / 5)

Siddharth Kaul Retirement: 2018 జూన్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు కౌల్ భారత్ తరఫున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయని సిద్ధార్థ్ టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
(2 / 5)

Siddharth Kaul Retirement: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున కౌల్ ఆడాడు. 34 ఏళ్ల ఈ స్టార్ పేసర్ 54 ఐపీఎల్ మ్యాచుల్లో 58 వికెట్లు పడగొట్టాడు. సిద్ధార్థ్ దేశవాళీ క్రికెట్ కెరీర్ చాలా ఉజ్వలంగా ఉంది. పంజాబ్ పేసర్ 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 297 వికెట్లు పడగొట్టాడు. 111 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 199 వికెట్లు పడగొట్టాడు. 145 టీ20 మ్యాచ్ లు ఆడిన సిద్ధార్థ్ 182 వికెట్లు పడగొట్టాడు.
(3 / 5)

Siddharth Kaul Retirement: 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సిద్ధార్థ్ కౌల్ సభ్యుడిగా ఉన్నాడు. ఇండియా-ఎ, ఇండియా బి, ఇండియా రెడ్, ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఉత్తరాంచల్ జట్లకు ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో సిద్ధార్థ్ పేరు ఉంది. అతని బేస్ ప్రైస్ రూ.40 లక్షలు. అయితే అతడిని జట్టులోకి తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 
(4 / 5)

Siddharth Kaul Retirement: సిద్ధార్థ్ కౌల్ నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున చివరిసారిగా ఆడాడు. ఈ ఏడాది నవంబర్ 6 నుంచి 8 వరకు రోహ్‌తక్ లో హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ సిద్ధార్థ్ కు చివరి మ్యాచ్. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి