తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shubman Gill Records: చెపాక్ టెస్టులో శుభమన్ గిల్ రికార్డుల మోత.. దిగ్గజాల సరసన చోటు

Shubman Gill Records: చెపాక్ టెస్టులో శుభమన్ గిల్ రికార్డుల మోత.. దిగ్గజాల సరసన చోటు

21 September 2024, 16:51 IST

IND vs BAN 1st Test Records: చెపాక్ టెస్టులో శతకం బాదిన శుభమన్ గిల్.. అరుదైన రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

IND vs BAN 1st Test Records: చెపాక్ టెస్టులో శతకం బాదిన శుభమన్ గిల్.. అరుదైన రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో భారత్ జట్టు బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గిల్ 176 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.
(1 / 9)
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో భారత్ జట్టు బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గిల్ 176 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.(AFP)
టెస్టు క్రికెట్‌లో శుభమన్ గిల్‌కి ఇది బ్యాక్ టు బ్యాక్ సెంచరీ. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో  జరిగిన చివరి టెస్టులోనూ శుభమన్ గిల్ సెంచరీ సాధించాడు. ప్రొఫెషనల్ ఓపెనర్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో గిల్ నెం.3లో బ్యాటింగ్ చేశాడు. 
(2 / 9)
టెస్టు క్రికెట్‌లో శుభమన్ గిల్‌కి ఇది బ్యాక్ టు బ్యాక్ సెంచరీ. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో  జరిగిన చివరి టెస్టులోనూ శుభమన్ గిల్ సెంచరీ సాధించాడు. ప్రొఫెషనల్ ఓపెనర్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో గిల్ నెం.3లో బ్యాటింగ్ చేశాడు. (PTI)
చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 119 పరుగులు చేశాడు. బంగ్లా టీమ్‌లో ఏ బౌలర్‌నీ గిల్ వదల్లేదు.  
(3 / 9)
చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 119 పరుగులు చేశాడు. బంగ్లా టీమ్‌లో ఏ బౌలర్‌నీ గిల్ వదల్లేదు.  (AFP)
2024లో శుభమన్ గిల్‌కి ఇది మూడో టెస్టు సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. రోహిత్, జైశ్వాల్ రెండేసి సెంచరీలతో తర్వాత స్థానంలో ఉన్నారు.
(4 / 9)
2024లో శుభమన్ గిల్‌కి ఇది మూడో టెస్టు సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. రోహిత్, జైశ్వాల్ రెండేసి సెంచరీలతో తర్వాత స్థానంలో ఉన్నారు.(AFP)
భారత్ జట్టు ఒకానొక దశలో 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా గిల్, పంత్ నాలుగో వికెట్‌కి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జంట మూడు గంటల పాటు బంగ్లాదేశ్ బౌలర్లని శనివారం ఉతికారేసింది.
(5 / 9)
భారత్ జట్టు ఒకానొక దశలో 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా గిల్, పంత్ నాలుగో వికెట్‌కి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జంట మూడు గంటల పాటు బంగ్లాదేశ్ బౌలర్లని శనివారం ఉతికారేసింది.(PTI)
2022 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ రికార్డ్‌ను గిల్ బ్రేక్ చేశాడు. గిల్‌కి ఇది 12వ సెంచరీ కాగా.. బాబర్ అజామ్ 11 శతకాలు చేశాడు.
(6 / 9)
2022 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ రికార్డ్‌ను గిల్ బ్రేక్ చేశాడు. గిల్‌కి ఇది 12వ సెంచరీ కాగా.. బాబర్ అజామ్ 11 శతకాలు చేశాడు.(PTI)
చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.
(7 / 9)
చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.(AFP)
ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో గిల్‌కి ఇది ఐదవ సెంచరీ. డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా గిల్ ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.
(8 / 9)
ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో గిల్‌కి ఇది ఐదవ సెంచరీ. డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా గిల్ ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.(AP)
చెపాక్ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 287/4తో డిక్లేర్ చేసింది. గిల్ 119 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
(9 / 9)
చెపాక్ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 287/4తో డిక్లేర్ చేసింది. గిల్ 119 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి