తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Gym Setup । ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకోండి!

Home Gym Setup । ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకోండి!

08 January 2024, 21:33 IST

Home Gym Setup: చాలా మంది జిమ్ మెంబర్‌షిప్ తీసుకొని కొన్ని రోజులకే మానేస్తారు, దీంతో డబ్బులు వృధా అవుతాయి. అయితే ఇంట్లోనే బడ్జెట్‌లో జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మీ ఖర్చును, సమయాన్ని ఆదా చేస్తుంది.

Home Gym Setup: చాలా మంది జిమ్ మెంబర్‌షిప్ తీసుకొని కొన్ని రోజులకే మానేస్తారు, దీంతో డబ్బులు వృధా అవుతాయి. అయితే ఇంట్లోనే బడ్జెట్‌లో జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మీ ఖర్చును, సమయాన్ని ఆదా చేస్తుంది.
మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్ణయించండి: మీరు మీ హోమ్ జిమ్‌ని ఏర్పాటు చేయడానికి ముందు, మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారు, మీ అవసరం ఏమిటి అనేది అవగాహన కలిగి ఉంటే, మీ హోమ్ జిమ్‌లో అందుకు తగిన పరికరాలు సమకూర్చుకోవచ్చు. 
(1 / 10)
మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్ణయించండి: మీరు మీ హోమ్ జిమ్‌ని ఏర్పాటు చేయడానికి ముందు, మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారు, మీ అవసరం ఏమిటి అనేది అవగాహన కలిగి ఉంటే, మీ హోమ్ జిమ్‌లో అందుకు తగిన పరికరాలు సమకూర్చుకోవచ్చు. (Pinterest)
మీ స్థలాన్ని అంచనా వేయండి: మీ హోమ్ జిమ్ కోసం మీ ఇంట్లో ఉన్న స్థలాన్ని పరిశీలించండి. మీకు అవసరమైన పరికరాల కోసం తగినంత స్థలం,  సరైన వెంటిలేషన్, బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి.
(2 / 10)
మీ స్థలాన్ని అంచనా వేయండి: మీ హోమ్ జిమ్ కోసం మీ ఇంట్లో ఉన్న స్థలాన్ని పరిశీలించండి. మీకు అవసరమైన పరికరాల కోసం తగినంత స్థలం,  సరైన వెంటిలేషన్, బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి.(Pinterest)
 అవసరమైన పరికరాల జాబితాను రూపొందించండి: మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పరికరాల జాబితాను రూపొందించండి.  యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, డంబెల్స్, స్టెబిలిటీ బాల్ మొదలైనవి.
(3 / 10)
 అవసరమైన పరికరాల జాబితాను రూపొందించండి: మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పరికరాల జాబితాను రూపొందించండి.  యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, డంబెల్స్, స్టెబిలిటీ బాల్ మొదలైనవి.(Pinterest)
తెలివిగా పరికరాలు ఎంచుకోండి: మీ హోమ్ జిమ్ పరికరాల కోసం అనవసర ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు.  ఉదాహరణకు, వాటర్ బాటిల్స్, డబ్బాలు వంటి వస్తువులను బరువులుగా ఉపయోగించవచ్చు. మీరు స్టెప్ ఏరోబిక్స్ కోసం కుర్చీ లేదా మెట్ల వంటి ఫర్నిచర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
(4 / 10)
తెలివిగా పరికరాలు ఎంచుకోండి: మీ హోమ్ జిమ్ పరికరాల కోసం అనవసర ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు.  ఉదాహరణకు, వాటర్ బాటిల్స్, డబ్బాలు వంటి వస్తువులను బరువులుగా ఉపయోగించవచ్చు. మీరు స్టెప్ ఏరోబిక్స్ కోసం కుర్చీ లేదా మెట్ల వంటి ఫర్నిచర్‌ను కూడా ఉపయోగించవచ్చు.(Pinterest)
డిస్కౌంట్లు చూసి షాపింగ్ చేయండి:  కొన్ని దుకాణాలు ఆఫ్-సీజన్ సమయంలో జిమ్ పరికరాలపై గొప్ప డీల్‌లను అందిస్తాయి. మీరు క్రెయిగ్స్‌లిస్ట్ లేదా Facebook Marketplace వంటి వెబ్‌సైట్‌లలో సెకండ్ సేల్ పరికరాల కోసం కూడా చూడవచ్చు.
(5 / 10)
డిస్కౌంట్లు చూసి షాపింగ్ చేయండి:  కొన్ని దుకాణాలు ఆఫ్-సీజన్ సమయంలో జిమ్ పరికరాలపై గొప్ప డీల్‌లను అందిస్తాయి. మీరు క్రెయిగ్స్‌లిస్ట్ లేదా Facebook Marketplace వంటి వెబ్‌సైట్‌లలో సెకండ్ సేల్ పరికరాల కోసం కూడా చూడవచ్చు.(Pinterest)
బహుళ వినియోగ పరికరాలు కొనుగోలు చేయండి: బహుళ వ్యాయామాల కోసం ఉపయోగించే పరికరాల కోసం చూడండి. ఉదాహరణకు, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా, స్ట్రెచింగ్స్ మొదలైన వాటన్నింటి కోసం ఒక రెసిస్టెంట్ బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు. స్టెబిలిటీ బాల్‌ను కోర్ వ్యాయామాలు, యోగా, సీటింగ్ కోసం ఉపయోగించవచ్చు.
(6 / 10)
బహుళ వినియోగ పరికరాలు కొనుగోలు చేయండి: బహుళ వ్యాయామాల కోసం ఉపయోగించే పరికరాల కోసం చూడండి. ఉదాహరణకు, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా, స్ట్రెచింగ్స్ మొదలైన వాటన్నింటి కోసం ఒక రెసిస్టెంట్ బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు. స్టెబిలిటీ బాల్‌ను కోర్ వ్యాయామాలు, యోగా, సీటింగ్ కోసం ఉపయోగించవచ్చు.(Pinterest)
శిక్షణ కోసం యూట్యూబ్:  మీరు మీ వ్యాయామ దినచర్యలో మరింత వైవిధ్యం కోసం చూస్తున్నట్లయితే, స్ట్రీమింగ్ వర్కవుట్ క్లాస్‌లను ఎంచుకోవచ్చు. YouTube, Amazon Prime , Netflix లలో మీరు ఇంట్లోనే చేయగలిగే అనేక రకాల వ్యాయామ వీడియోలు ఉంటాయి.
(7 / 10)
శిక్షణ కోసం యూట్యూబ్:  మీరు మీ వ్యాయామ దినచర్యలో మరింత వైవిధ్యం కోసం చూస్తున్నట్లయితే, స్ట్రీమింగ్ వర్కవుట్ క్లాస్‌లను ఎంచుకోవచ్చు. YouTube, Amazon Prime , Netflix లలో మీరు ఇంట్లోనే చేయగలిగే అనేక రకాల వ్యాయామ వీడియోలు ఉంటాయి.(Pinterest)
 మీ శరీర బరువును ఉపయోగించుకోండి: బాడీ వెయిట్ వ్యాయామాలు చేయడానికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. పుష్-అప్‌లు, స్క్వాట్‌లు వంటివి అన్నీ మీ శరీర బరువుతో చేసే గొప్ప వ్యాయామాలు
(8 / 10)
 మీ శరీర బరువును ఉపయోగించుకోండి: బాడీ వెయిట్ వ్యాయామాలు చేయడానికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. పుష్-అప్‌లు, స్క్వాట్‌లు వంటివి అన్నీ మీ శరీర బరువుతో చేసే గొప్ప వ్యాయామాలు(Pinterest)
 బహిరంగ స్థలాన్ని ఉపయోగించుకోండి: మీకు పెరడు లేదా సమీపంలోని పార్క్ ఉంటే, మీ వ్యాయామ దినచర్య కోసం దాని ప్రయోజనాన్ని పొందండి. రన్నింగ్, హైకింగ్,  బైకింగ్ వంటి అవుట్‌డోర్ కార్యకలాపాలు ఉచిత వ్యాయామంతో పాటు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి గొప్ప మార్గాలు.
(9 / 10)
 బహిరంగ స్థలాన్ని ఉపయోగించుకోండి: మీకు పెరడు లేదా సమీపంలోని పార్క్ ఉంటే, మీ వ్యాయామ దినచర్య కోసం దాని ప్రయోజనాన్ని పొందండి. రన్నింగ్, హైకింగ్,  బైకింగ్ వంటి అవుట్‌డోర్ కార్యకలాపాలు ఉచిత వ్యాయామంతో పాటు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి గొప్ప మార్గాలు.(Pinterest)
వర్కౌట్ స్నేహితుడిని ఎంచుకోండి: వర్కవుట్ స్నేహితుడిని కలిగి ఉండటం వలన మిమ్మల్ని ఉత్సాహంగా, ట్రాక్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా, స్నేహితుడితో వ్యాయామం చేయడం మరింత సరదాగా ఉంటుంది.
(10 / 10)
వర్కౌట్ స్నేహితుడిని ఎంచుకోండి: వర్కవుట్ స్నేహితుడిని కలిగి ఉండటం వలన మిమ్మల్ని ఉత్సాహంగా, ట్రాక్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా, స్నేహితుడితో వ్యాయామం చేయడం మరింత సరదాగా ఉంటుంది.(Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి