తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shoe Bite- Remedies । కొత్త పాదరక్షలు కరుస్తున్నాయా.. ఆయుర్వేద నివారణ మార్గాలు ఇవిగో!

Shoe Bite- Remedies । కొత్త పాదరక్షలు కరుస్తున్నాయా.. ఆయుర్వేద నివారణ మార్గాలు ఇవిగో!

08 January 2024, 20:38 IST

Shoe Bite- Ayurvedic Remedies: కొత్త బూట్లు లేదా మన సైజుకు సరిపోని పాదరక్షలు ధరించి నడుస్తున్నపుడు అవి చర్మంపై రుద్దడం వల్ల కలిగే మంటతో పాటు, చర్మం కమిలిపోతుంది. దీనిని తగ్గించడానికి ఉపయోగించే కొన్ని ఆయుర్వేద నివారణలు ఇక్కడ ఉన్నాయి.

Shoe Bite- Ayurvedic Remedies: కొత్త బూట్లు లేదా మన సైజుకు సరిపోని పాదరక్షలు ధరించి నడుస్తున్నపుడు అవి చర్మంపై రుద్దడం వల్ల కలిగే మంటతో పాటు, చర్మం కమిలిపోతుంది. దీనిని తగ్గించడానికి ఉపయోగించే కొన్ని ఆయుర్వేద నివారణలు ఇక్కడ ఉన్నాయి.
కొత్తవి, సైజుకు సరిపోని బూట్లు చర్మంపై ఘర్షణ కలుగజేస్తాయి. కాలి చీలమండల చర్మంపై ఏర్పడే బొబ్బలు నొప్పిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో చికిత్స చేయటానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఆయుర్వేదిక్ డాక్టర్  డింపుల్ జంగ్దా అందించారు
(1 / 5)
కొత్తవి, సైజుకు సరిపోని బూట్లు చర్మంపై ఘర్షణ కలుగజేస్తాయి. కాలి చీలమండల చర్మంపై ఏర్పడే బొబ్బలు నొప్పిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో చికిత్స చేయటానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఆయుర్వేదిక్ డాక్టర్  డింపుల్ జంగ్దా అందించారు(pexels)
 కలబంద: ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, హీలింగ్ , కూలింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మీ పాదాలపై పొక్కులను తగ్గించడంలో సహాయపడుతుంది.
(2 / 5)
 కలబంద: ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, హీలింగ్ , కూలింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మీ పాదాలపై పొక్కులను తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)
 తేనె: ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. పొక్కుల చుట్టూ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలోని గుణాలు తదుపరి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. ఒక కాటన్ బాల్ తీసుకొని తేనెలో వేయండి. ప్రభావితమైన ప్రదేశంలో దీన్ని ఉంచండి
(3 / 5)
 తేనె: ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. పొక్కుల చుట్టూ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలోని గుణాలు తదుపరి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. ఒక కాటన్ బాల్ తీసుకొని తేనెలో వేయండి. ప్రభావితమైన ప్రదేశంలో దీన్ని ఉంచండి(Unsplash)
పసుపు- వేప: వేప ఆకులు, పసుపు (కుర్కుమిన్) లోని క్రియాశీల సమ్మేళనాలు వాపు , ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. 
(4 / 5)
పసుపు- వేప: వేప ఆకులు, పసుపు (కుర్కుమిన్) లోని క్రియాశీల సమ్మేళనాలు వాపు , ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. (Pixabay)
పొక్కులు, బొబ్బలు ఏర్పడి చర్మం మంటగా ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. నయం అయ్యే వరకు బిగుతుగా ఉండే బూట్లు లేదా కొత్త బూట్లు నివారించండి.  కొత్త బూట్లు ధరించినపుడు రెండు వైపులా నూనెను ఉపయోగించడం,  సాక్స్‌లు, ప్రొటెక్టర్‌లు లేదా అంటుకునే ప్యాడింగ్‌లను ధరించడం వలన సౌకర్యంగా నడవవచ్చు. 
(5 / 5)
పొక్కులు, బొబ్బలు ఏర్పడి చర్మం మంటగా ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. నయం అయ్యే వరకు బిగుతుగా ఉండే బూట్లు లేదా కొత్త బూట్లు నివారించండి.  కొత్త బూట్లు ధరించినపుడు రెండు వైపులా నూనెను ఉపయోగించడం,  సాక్స్‌లు, ప్రొటెక్టర్‌లు లేదా అంటుకునే ప్యాడింగ్‌లను ధరించడం వలన సౌకర్యంగా నడవవచ్చు. (pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి