తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏసీ బిల్లు ఎలా ఆదా చేయాలి? ఏసీ ఆన్ చేసినప్పుడు గుర్తుంచుకోవలసిన 5 విషయాలు

ఏసీ బిల్లు ఎలా ఆదా చేయాలి? ఏసీ ఆన్ చేసినప్పుడు గుర్తుంచుకోవలసిన 5 విషయాలు

02 April 2024, 17:15 IST

ఏసీ బిల్లు ఆదా చిట్కాలు: ఎండలు మండుతున్నాయి. అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఏసీ వాడకం కూడా పెరుగుతోంది. మరి విద్యుత్ ఖర్చులను ఆదా చేయడానికి మనం ఏం చేయవచ్చు? ఈ చిట్కాలు తెలుసుకోండి.

  • ఏసీ బిల్లు ఆదా చిట్కాలు: ఎండలు మండుతున్నాయి. అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఏసీ వాడకం కూడా పెరుగుతోంది. మరి విద్యుత్ ఖర్చులను ఆదా చేయడానికి మనం ఏం చేయవచ్చు? ఈ చిట్కాలు తెలుసుకోండి.
ఏసీని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచొద్దు: ఎయిర్ కండిషనర్ టెంపరేచర్ చాలా తక్కువగా  ఉంటే బిల్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతను ఎక్కువగా తగ్గించవద్దు. ఏసీని 26-27 డిగ్రీల వద్ద రన్ చేయాలి. ఇది కంప్రెషర్ పై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కరెంటు బిల్లులపై ఆదా..  
(1 / 5)

టైమర్ పెట్టుకోండి: ఏసీ రన్ చేసేటప్పుడు చాలా మంది టైమర్ ఆన్ చేయరు. దీంతో రాత్రంతా ఏసీ రన్ అవుతూ కరెంటు ఖర్చును పెంచుతుంది. ఉదాహరణకు మీరు అర్ధరాత్రి ఒంటి గంట లేదా రెండు గంటల వరకే ఏసీ రన్ అవ్వాలనుకుంటే ఆ మేరకు టైమర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఎసి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది.
(2 / 5)

రెగ్యులర్ సర్వీసింగ్ : సర్వీసింగ్ చేయకపోయినా బిల్లు పెరుగుతుంది. అప్పుడప్పుడు ఏసీని సర్వీసింగ్ చేయించుకోవడం ముఖ్యం. దీంతో దుమ్మూదూళీ శుభ్రమై పరికరం మెరుగ్గా పనిచేస్తుంది. అప్పుడు విద్యుత్తు వినియోగం తగ్గుతుంది. అలాగే గ్యాస్ లీకేజీ అరికట్టకపోతే, గ్యాస్ తక్కువవుతుంది. అప్పుడు కంప్రెషర్ మీద భారం పడుతుంది. తద్వారా విద్యుత్తు బిల్లు ఎక్కువ వస్తుంది.
(3 / 5)

సీలింగ్ ఫ్యాన్ తో నడపండి: చాలా మంది ఏసీ నడుపుతారు. కానీ ఫ్యాన్ ఆపేస్తారు. సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గించి నడపాలి. దీంతో ఇల్లు త్వరగా చల్లబడుతుంది. ఫలితంగా ఏసీని త్వరగా ఆఫ్ చేయవచ్చు. 
(4 / 5)

ఎంపిక: సోలార్ ఎనర్జీతో ఏసీ నడిపితే ప్రయోజనం ఉంటుంది. మొదట్లో, ఈ పరికరాన్ని కొనడానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ తరువాత మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇలా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు. అలాగే 5 స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ సామర్థ్యం కలిగిన ఏసీలైతే విద్యుత్తు వినియోగం చాలా వరకు తగ్గుతుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి