తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sri Lanka Cricket: ఇండియాతో సిరీస్‍కు ముందు శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్‍గా సనత్ జయసూర్య

Sri Lanka Cricket: ఇండియాతో సిరీస్‍కు ముందు శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్‍గా సనత్ జయసూర్య

08 July 2024, 20:35 IST

Sanath Jayasuriya - Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ టీమ్ తాత్కాలిక హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య నియమితుడయ్యాడు. భారత్‍తో సిరీస్‍కు ముందు అతడు బాధ్యతలు చేపడుతున్నాడు.

  • Sanath Jayasuriya - Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ టీమ్ తాత్కాలిక హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య నియమితుడయ్యాడు. భారత్‍తో సిరీస్‍కు ముందు అతడు బాధ్యతలు చేపడుతున్నాడు.
శ్రీలంక క్రికెట్‍లో మార్పులు జరిగాయి. ఆ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ప్లేయర్ సనత్ జయసూర్య నియమితుడయ్యాడు. జూన్‍లో జరిగిన టీ20 ప్రపంచకప్‍లో లంకకు సలహాదారుడిగా ఉన్న జయసూర్య.. ఇప్పుడు హెడ్ కోచ్ అయ్యారు. 
(1 / 5)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో గ్రూప్ దశలోనే శ్రీలంక నిష్క్రమించి నిరాశపరిచింది. దీంతో హెడ్ కోచ్‍గా ఉన్న క్రిస్ సిల్వర్‌వుడ్ ఆ స్థానం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ స్థానంలో తాత్కాలికంగా 55 ఏళ్ల జయసూర్యను శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. గతంలో రెండుసార్లు చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన అతడు.. తొలిసారి లంకకు హెడ్ కోచ్‍ బాధ్యతలు తీసుకోనున్నాడు. 
(2 / 5)

2023 వన్డే ప్రపంచకప్, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీల్లో శ్రీలంక తీవ్రంగా విఫలమైంది. గ్రూప్ దశ దాటలేకపోయింది. వన్డే ప్రపంచకప్‍లో వైఫల్యంతో 2025 చాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. 
(3 / 5)

ఈ ఏడాది జూలై, ఆగస్టు మధ్య స్వదేశంలో టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లను శ్రీలంక ఆడనుంది. ఈ ద్వేపాక్షిక సిరీస్‍ పోరు జూలై 27న మొదలుకానుంది. 
(4 / 5)

భారత్‍తో సిరీస్ కోసం జయసూర్యను తాత్కాలికంగానే హెడ్‍కోచ్‍గా శ్రీలంక బోర్డు నియమించింది. ఫుల్ టైమ్ కోచ్‍ను నియమించేందుకు మరికొంత కాలం వేచిచూడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‍తో పాటు ఇంగ్లండ్‍తో సిరీస్‍లకు జయసూర్యను హెచ్‍కోచ్‍ను చేసింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి