తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Rythu Bharosa Scheme : వానాకాలం సాగు పనులు షురూ - ఆ తర్వాతే 'రైతు భరోసా' నిధులు...! తాజా అప్డేట్స్ ఇవే

TG Govt Rythu Bharosa Scheme : వానాకాలం సాగు పనులు షురూ - ఆ తర్వాతే 'రైతు భరోసా' నిధులు...! తాజా అప్డేట్స్ ఇవే

12 June 2024, 10:16 IST

TG Govt Rythu Bharosa Scheme Updates : తెలంగాణలో పంట పెట్టుబడి సాయం సమయం అసన్నమైంది. తొలుకరి చినుకులతో రైతన్నలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా నిధులు సారి ఎప్పుడు జమ అవుతాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • TG Govt Rythu Bharosa Scheme Updates : తెలంగాణలో పంట పెట్టుబడి సాయం సమయం అసన్నమైంది. తొలుకరి చినుకులతో రైతన్నలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా నిధులు సారి ఎప్పుడు జమ అవుతాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
తెలంగాణలో పంట పెట్టుబడి సాయం సమయం అసన్నమైంది. తొలుకరి చినుకులతో రైతన్నలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో రైతు బంధు పేరుతో అన్నదాతలకు ఎకరానికి రూ. 5వేల సాయం అందించేవారు. 
(1 / 6)

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ. 15వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. దీంతో ఈసారి రైతు భరోసా పేరుతోనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది. అయితే ఎప్పుడు వస్తాయనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
(2 / 6)

అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రెండు పంటలకు రూ. 15 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఈ వానకాలం సాగుకు ఎకరానికి రూ. 7,500 ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న రైతు బంధు స్కీమ్ నిబంధనలను మార్చి… అర్హులైన వారికే ఇస్తామని స్పష్టం చేసింది.
(3 / 6)

సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా… రైతుబంధు వచ్చేది. కానీ ఈసారి సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్ ఉంది. అయితే ఇది ఐదు ఎకరాలకు పెట్టలా..? లేక 10 ఎకరాలకు విధించాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
(4 / 6)

వానకాలం సాగు పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో… రైతు భరోసా నిధుల కోసం రైతన్నలు ఎదురుచూసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ పై దృష్టిసారించే విధంగా సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రాథమికంగా ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ స్కీమ్ పై లోతుగా చర్చ జరగాలని సర్కార్ భావిస్తోంది. 
(5 / 6)

రైతు భరోసా మార్గదర్శకాలతో పాటు సీలింగ్ విధింపు అంశాలపై లోతుగా చర్చ జరగాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటటన వచ్చే అవకాశం ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి