తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mi Vs Dc: ఒకే ఓవర్లో 32 పరుగులు బాదిన ముంబై ఇండియన్స్ బ్యాటర్.. బౌండరీల వర్షం

MI vs DC: ఒకే ఓవర్లో 32 పరుగులు బాదిన ముంబై ఇండియన్స్ బ్యాటర్.. బౌండరీల వర్షం

07 April 2024, 17:47 IST

MI vs DC IPL 2024: ముంబై ఇండియన్స్ ప్లేయర్ రొమారియో షెఫల్డ్ హిట్టింగ్ సునామీ సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నేటి మ్యాచ్‍లో ఒకే ఓవర్లో 32 పరుగులు బాదేశాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. ఆ వివరాలివే..

  • MI vs DC IPL 2024: ముంబై ఇండియన్స్ ప్లేయర్ రొమారియో షెఫల్డ్ హిట్టింగ్ సునామీ సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నేటి మ్యాచ్‍లో ఒకే ఓవర్లో 32 పరుగులు బాదేశాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. ఆ వివరాలివే..
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో ముంబై ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ అద్భుత హిట్టింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు బాదాడు. 
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో ముంబై ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ అద్భుత హిట్టింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు బాదాడు. (AP)
ఢిల్లీ బౌలర్ ఎన్రిచ్ నార్జే వేసిన 20వ ఓవర్లో ముంబై బ్యాటర్ రొమారియో షెఫర్డ్ వీరంగం చేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదేశాడు షెఫర్డ్. భారీ షాట్లతో దుమ్మురేపాడు. 
(2 / 5)
ఢిల్లీ బౌలర్ ఎన్రిచ్ నార్జే వేసిన 20వ ఓవర్లో ముంబై బ్యాటర్ రొమారియో షెఫర్డ్ వీరంగం చేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదేశాడు షెఫర్డ్. భారీ షాట్లతో దుమ్మురేపాడు. (AP)
పేసర్ నార్జే వేసిన 20వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో చెలరేగాడు రొమారియో షెఫర్డ్. ఈ మ్యాచ్‍లో 10 బంతుల్లోనే 39 పరుగులతో (నాటౌట్) మెరుపులు మెరిపించాడు. షెఫర్డ్ విజృంభణతో ముంబై జట్టుకు భారీ స్కోరు దక్కింది. 
(3 / 5)
పేసర్ నార్జే వేసిన 20వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో చెలరేగాడు రొమారియో షెఫర్డ్. ఈ మ్యాచ్‍లో 10 బంతుల్లోనే 39 పరుగులతో (నాటౌట్) మెరుపులు మెరిపించాడు. షెఫర్డ్ విజృంభణతో ముంబై జట్టుకు భారీ స్కోరు దక్కింది. 
ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45 నాటౌట్) అదరగొట్టగా.. చివర్లో షెఫర్డ్ వీర హిట్టింగ్‍తో విజృంభించాడు. దీంతో ఈ మ్యాచ్‍లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై. 
(4 / 5)
ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45 నాటౌట్) అదరగొట్టగా.. చివర్లో షెఫర్డ్ వీర హిట్టింగ్‍తో విజృంభించాడు. దీంతో ఈ మ్యాచ్‍లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై. (PTI)
దీంతో ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు 235 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది. ఈ భారీ టార్గెట్‍ను ఛేదించకుండా ఢిల్లీని నిలువరిస్తే ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై బోణీ కొట్టనుంది. 
(5 / 5)
దీంతో ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు 235 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది. ఈ భారీ టార్గెట్‍ను ఛేదించకుండా ఢిల్లీని నిలువరిస్తే ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై బోణీ కొట్టనుంది. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి