తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rcb Vs Upw Wpl 2024: మళ్లీ గెలుపుబాట పట్టిన బెంగళూరు.. స్మృతి సూపర్ హిట్టింగ్

RCB vs UPW WPL 2024: మళ్లీ గెలుపుబాట పట్టిన బెంగళూరు.. స్మృతి సూపర్ హిట్టింగ్

04 March 2024, 23:19 IST

RCB vs UPW WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు మళ్లీ గెలుపుబాట పట్టింది. నేడు (మార్చి 4) జరిగిన మ్యాచ్‍లో యూపీ వారియర్స్ టీమ్‍పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.  

  • RCB vs UPW WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు మళ్లీ గెలుపుబాట పట్టింది. నేడు (మార్చి 4) జరిగిన మ్యాచ్‍లో యూపీ వారియర్స్ టీమ్‍పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.  
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ పుంజుకుంది. టోర్నీ ఆరంభంలో రెండు విజయాల తర్వాత రెండు ఓటములు ఎదురవడంతో నిరాశ చెందిన ఆ జట్టు.. మళ్లీ గెలుపు బాటపట్టింది. 
(1 / 6)
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ పుంజుకుంది. టోర్నీ ఆరంభంలో రెండు విజయాల తర్వాత రెండు ఓటములు ఎదురవడంతో నిరాశ చెందిన ఆ జట్టు.. మళ్లీ గెలుపు బాటపట్టింది. (PTI)
బెంగళూరు వేదికగా నేడు (మార్చి 4) జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ టీమ్‍పై ఘన విజయం సాధించింది. 
(2 / 6)
బెంగళూరు వేదికగా నేడు (మార్చి 4) జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ టీమ్‍పై ఘన విజయం సాధించింది. (PTI)
ఈ మ్యాచ్‍లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ స్మృతి మంధాన 50 బంతుల్లోనే 80 పరుగులతో అదరగొట్టారు. సూపర్ హిట్టింగ్ చేశారు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అదరగొట్టారు.
(3 / 6)
ఈ మ్యాచ్‍లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ స్మృతి మంధాన 50 బంతుల్లోనే 80 పరుగులతో అదరగొట్టారు. సూపర్ హిట్టింగ్ చేశారు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అదరగొట్టారు.(PTI)
స్మృతితో పాటు ఎలీస్ పెర్రీ (58) కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
(4 / 6)
స్మృతితో పాటు ఎలీస్ పెర్రీ (58) కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. (PTI)
లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసి, ఓటమి పాలైంది. కెప్టెన్ అలీస్ హేలీ (55) అర్ధ శకతం చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో దీప్తి శర్మ (33), పూనమ్ కమీర్ (31) పోరాడినా యూపీకి గెలుపు దక్కలేదు. బెంగళూరు బౌలర్లలో సోఫీ డివైన్, సోఫీ మొలినెక్స్, జార్జియా వరేహమ్, ఆశా శోభన చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 
(5 / 6)
లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసి, ఓటమి పాలైంది. కెప్టెన్ అలీస్ హేలీ (55) అర్ధ శకతం చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో దీప్తి శర్మ (33), పూనమ్ కమీర్ (31) పోరాడినా యూపీకి గెలుపు దక్కలేదు. బెంగళూరు బౌలర్లలో సోఫీ డివైన్, సోఫీ మొలినెక్స్, జార్జియా వరేహమ్, ఆశా శోభన చెరో రెండు వికెట్లు పడగొట్టారు. (PTI)
ఈ గెలుపుతో ఆరు పాయింట్లతో డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది. యూపీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ ఆఖరిదైన ఐదో ప్లేస్‍లో ఉంది. 
(6 / 6)
ఈ గెలుపుతో ఆరు పాయింట్లతో డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది. యూపీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ ఆఖరిదైన ఐదో ప్లేస్‍లో ఉంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి