తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Ts Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! తగ్గిన వడగాలుల తీవ్రత, మరో 3 రోజులు వర్షాలు...!

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! తగ్గిన వడగాలుల తీవ్రత, మరో 3 రోజులు వర్షాలు...!

22 April 2024, 7:14 IST

AP TS Weather Updates : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. ఓవైపు ఎండ తీవ్రతలు ఉన్నప్పటికీ… ఏదో ఒక సమయానికి వాతావరణం పూర్తిగా చల్లగా మారుతుంది. ఏపీలో వడగాలలు తీవ్రత కొంచెం తగ్గగా… మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • AP TS Weather Updates : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. ఓవైపు ఎండ తీవ్రతలు ఉన్నప్పటికీ… ఏదో ఒక సమయానికి వాతావరణం పూర్తిగా చల్లగా మారుతుంది. ఏపీలో వడగాలలు తీవ్రత కొంచెం తగ్గగా… మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ఏపీ, తెలంగాణలో ఓవైపు ఎండల దంచికొడుతున్నాయి. కానీ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. 
(1 / 7)
ఏపీ, తెలంగాణలో ఓవైపు ఎండల దంచికొడుతున్నాయి. కానీ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. (photo source from https://unsplash.com/)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. వాతావరణంలో మార్పులతో నాలుగైదు రోజులుగా పలుచోట్ల వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. మరికొన్నిచోట్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది.
(2 / 7)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. వాతావరణంలో మార్పులతో నాలుగైదు రోజులుగా పలుచోట్ల వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. మరికొన్నిచోట్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది.(photo source from https://unsplash.com/)
ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో వడగాలుల తీవ్రత ఆదివారం కొంతమేర తగ్గింది. ఏపీలో చూస్తే.. ఆదివారం(ఏప్రిల్ 21) కేవలం 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇవాళ(ఏప్రిల్ 22) 26 మండలాల్లో తీవ్రవడగాల్పులు,64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని,ఎల్లుండి 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు,88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 
(3 / 7)
ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో వడగాలుల తీవ్రత ఆదివారం కొంతమేర తగ్గింది. ఏపీలో చూస్తే.. ఆదివారం(ఏప్రిల్ 21) కేవలం 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇవాళ(ఏప్రిల్ 22) 26 మండలాల్లో తీవ్రవడగాల్పులు,64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని,ఎల్లుండి 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు,88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. (photo source from https://unsplash.com/)
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వెల్లడించింది.
(4 / 7)
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వెల్లడించింది.(photo source from https://unsplash.com/)
తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
(5 / 7)
తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.(photo source from https://unsplash.com/)
ఇవాళ ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని… ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(6 / 7)
ఇవాళ ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని… ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.(photo source from https://unsplash.com/)
సోమవారం నుంచి మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం వరకు  ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని… ఆ తర్వాత వాతావరం పొడిగా ఉంటుందని వెల్లడించింది.
(7 / 7)
సోమవారం నుంచి మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం వరకు  ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని… ఆ తర్వాత వాతావరం పొడిగా ఉంటుందని వెల్లడించింది.(photo source from https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి