తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rachakonda Trip : ప్రకృతి అందాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..! హైదరాబాద్ కు పక్కనే ఉన్న 'రాచకొండ కోటను' చూసొద్దామా..!

Rachakonda Trip : ప్రకృతి అందాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..! హైదరాబాద్ కు పక్కనే ఉన్న 'రాచకొండ కోటను' చూసొద్దామా..!

28 April 2024, 10:20 IST

Rachakonda Fort Tourism in Telangana : హైదరాబాద్ నుంచి ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే నగరానికి కూత వేటు దూరంలోనే ఉంది రాచకొండ కోట(Rachakonda Fort).ఇక్కడి ప్రకృతి అందాలతో పాటు నాటి వారసత్వ సంపదను చూస్తే ఎంతో వైభవంగా ఉంటుంది. ఈ రాచకొండ ట్రిప్ వివరాలను ఇక్కడ చూడండి….

  • Rachakonda Fort Tourism in Telangana : హైదరాబాద్ నుంచి ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే నగరానికి కూత వేటు దూరంలోనే ఉంది రాచకొండ కోట(Rachakonda Fort).ఇక్కడి ప్రకృతి అందాలతో పాటు నాటి వారసత్వ సంపదను చూస్తే ఎంతో వైభవంగా ఉంటుంది. ఈ రాచకొండ ట్రిప్ వివరాలను ఇక్కడ చూడండి….
రాచకొండ… రాజులు పాలించిన ప్రాంతం. కాకయతీ సామ్రాజ్య సామంత రాజులుగా ఉన్న రేచంర్ల వంశస్తుల పాలన కేంద్రం. శుత్ర దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోటకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.
(1 / 10)

తెలంగాణ ఏర్పాటు తర్వాత… ఈ ప్రాంతం మంచి టూరిజం స్పాట్ గా మారిపోయింది. ప్రభుత్వం కూడా ఈ కోట అభివృద్ధికి కొన్ని చర్యలను చేపట్టింది. 
(2 / 10)

 హైదరాబాద్ కు అత్యంత సమీపం ఈ కోట ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని సంస్థాన్ నారాయణపురం మండలంలో ఈ రాచకొండ గుట్టలు ఉంటాయి. ఎల్బీ నగర్ నుంచి రెండు విధాలుగా ఇక్కడికి చేరుకోవచ్చు.
(3 / 10)

ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ్నుంచి మంచాల మీదుగా ఈ కోటకు చేరుకోవచ్చు. ఇలా కాకుండా… ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ కు చేరుకొని అక్కడ్నుంచి నేరుగా నారాయణపురం వెళ్లొచ్చు. అక్కడ్నుంచి చాలా దగ్గరిగా రాచకొండ ఉంటుంది.
(4 / 10)

ఈ ప్రాంతానికి చేరుకోగానే… మొదటగా కోట ఎంట్రెన్స్ ఉంది. ఇది చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రవేశం గుండానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కోటపైకి చేరుకోకముందే… కింద ఓ గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ఒక బావి ఉంటుంది.
(5 / 10)

రాచకొండ చుట్టూ ప్రాకారం ఉంటుంది. కోటపైకి వెళ్తుంటే ద్వారాలు ఉంటాయి. దాదాపు 5 నుంచి 6 ద్వారాలు వస్తాయి. ఇవన్నీ దాటితేనే కోటపైకి వెళ్తాం. 
(6 / 10)

కోటపైకి చేరుకునే వెళ్లే మార్గంలోనే కల్యాణ మండపం ఉంటుంది. గతంలో పురాతనంగా మారిపోయిన ఈ మండపాన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టి…. బాగు చేసింది. ఇక ఈ గుట్టపైన మండపాలు, రాజప్రాసాదాలు, జలాశయాలు కూడా ఉంటాయి. 
(7 / 10)
కోటపైకి చేరుకునే వెళ్లే మార్గంలోనే కల్యాణ మండపం ఉంటుంది. గతంలో పురాతనంగా మారిపోయిన ఈ మండపాన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టి…. బాగు చేసింది. ఇక ఈ గుట్టపైన మండపాలు, రాజప్రాసాదాలు, జలాశయాలు కూడా ఉంటాయి. (రాచకొండ వద్ద ఉన్న కల్యాణ మండపం - ఫైల్ ఫొటో)
ఇక రాచకొండ కోటకు వెళ్తే… చూడాల్సిన ప్లేస్ సంకెళ్ల బావి. కొండ పైన రెండు బండల మధ్య నీళ్లు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ చూసిన నీళ్లు ఉంటాయి. అసలు ఇక్కడిరి నీరు ఎలా వస్తుందనేది తెలియదు. ఈ సంకెళ్ల బాయి గురించి చాలా రకాలుగా చెబుతుంటారు.
(8 / 10)

రాచకండ  గుట్టపై నుంచి చూస్తే….ప్రకృతి అందాలను వర్ణించలేం. చుట్టుపక్కన ఉండే గ్రామాలు, వాటి పక్కనే ఉండే పంటలు… ఇలా ఎన్నో ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో చాలా పురాతన ఆలయాలు కనిపిస్తాయి. ఇటీవలే ఇక్కడ ఉన్న ఓ మెట్ల బావిని ప్రభుత్వం పూర్తిగా పునరుద్ధరించింది.
(9 / 10)

రాచకొండ వైభవాన్ని చాటి చెప్పేలా రాచకొండ ఉత్సవాలు కూడా జరుగుతాయి. ప్రతి ఏడాది మూడు రోజులపాటు వీటిని నిర్వహిస్తారు. ఇక రాచకొండ ప్రాంతంలో అతిపెద్ద శివలింగం బయటపడింది. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. మీరు కూడా వీలైతే ఏదో ఒక టైం చూసూకొని… ఈ ప్రాంతాన్ని చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి