తెలుగు న్యూస్  /  ఫోటో  /  South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే స్మార్ట్ గురూ.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు

South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే స్మార్ట్ గురూ.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు

23 November 2024, 16:28 IST

South Central Railway : ప్రయాణికులు, వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నగదు సమస్యను పరిష్కరించడానికి క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 6 డివిజన్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పేమెంట్ సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

  • South Central Railway : ప్రయాణికులు, వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నగదు సమస్యను పరిష్కరించడానికి క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 6 డివిజన్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పేమెంట్ సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్‌లోని ఆరు డివిజన్‌లలో ఉన్న రైల్వే స్టేషన్‌లలోని 35 ప్రధాన పార్శిల్ కార్యాలయాలలో 'క్యూఆర్ కోడ్' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
(1 / 5)
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్‌లోని ఆరు డివిజన్‌లలో ఉన్న రైల్వే స్టేషన్‌లలోని 35 ప్రధాన పార్శిల్ కార్యాలయాలలో 'క్యూఆర్ కోడ్' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. (@SCRailwayIndia)
సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, బీదర్, కాజీపేట, లింగంపల్లి, హైదరాబాద్ డివిజన్‌లోని కాచిగూడ, నిజామాబాద్, విజయవాడ డివిజన్‌లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, సామర్లకోట, గుడివాడ, తెనాలి, గూడూరు, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, నర్సాపూర్, గుంతకల్ డివిజన్‌లోని కడప, అనంతపురం, రాయచూర్, ధర్మవరం, తిరుపతి, గుంతకల్, రేణిగుంట, ధోనే, చిత్తూరు, నంద్యాల, గుంటూరు డివిజన్‌లో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. 
(2 / 5)
సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, బీదర్, కాజీపేట, లింగంపల్లి, హైదరాబాద్ డివిజన్‌లోని కాచిగూడ, నిజామాబాద్, విజయవాడ డివిజన్‌లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, సామర్లకోట, గుడివాడ, తెనాలి, గూడూరు, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, నర్సాపూర్, గుంతకల్ డివిజన్‌లోని కడప, అనంతపురం, రాయచూర్, ధర్మవరం, తిరుపతి, గుంతకల్, రేణిగుంట, ధోనే, చిత్తూరు, నంద్యాల, గుంటూరు డివిజన్‌లో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. (@SCRailwayIndia)
ఈ సదుపాయం పార్సెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే పరికరాలను పార్శిల్ కార్యాలయాల వద్ద ఇన్‌స్టాల్ చేసినట్టు వెల్లడించారు. వీటిని పార్సెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌‌తో అనుసంధానించినట్టు వివరించారు.
(3 / 5)
ఈ సదుపాయం పార్సెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే పరికరాలను పార్శిల్ కార్యాలయాల వద్ద ఇన్‌స్టాల్ చేసినట్టు వెల్లడించారు. వీటిని పార్సెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌‌తో అనుసంధానించినట్టు వివరించారు.(@SCRailwayIndia)
ఈ సదుపాయం పార్శిల్ బుకింగ్ లావాదేవీలను త్వరగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందని.. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వివరించారు. వినియోగదారులకు అవాంతరాలు లేని, సురక్షితమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అని జైన్ అభిప్రాయపడ్డారు.
(4 / 5)
ఈ సదుపాయం పార్శిల్ బుకింగ్ లావాదేవీలను త్వరగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందని.. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వివరించారు. వినియోగదారులకు అవాంతరాలు లేని, సురక్షితమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అని జైన్ అభిప్రాయపడ్డారు.(@SCRailwayIndia)
క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తినా.. అధికారులు వెంటనే పరిష్కరిస్తారని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేస్తోంది. వినియోగదారులు వీటి ద్వారానే చెల్లింపులు చేయాలని సూచిస్తోంది. క్యూఆర్ కోడ్ ఏర్పాటుపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
(5 / 5)
క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తినా.. అధికారులు వెంటనే పరిష్కరిస్తారని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేస్తోంది. వినియోగదారులు వీటి ద్వారానే చెల్లింపులు చేయాలని సూచిస్తోంది. క్యూఆర్ కోడ్ ఏర్పాటుపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (@SCRailwayIndia)

    ఆర్టికల్ షేర్ చేయండి