తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ratha Saptami : తిరుమలలో రథసప్తమి సందర్భంగా.. ప్రారంభమైన స్వామివారి వాహన సేవలు..

Ratha Saptami : తిరుమలలో రథసప్తమి సందర్భంగా.. ప్రారంభమైన స్వామివారి వాహన సేవలు..

28 January 2023, 9:38 IST

Ratha Saptami at Tirumala : తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా.. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి. 

  • Ratha Saptami at Tirumala : తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా.. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి. 
తిరుమలలో ఈరోజు (శనివారం) ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ఘనంగా మొదలయ్యాయి.
(1 / 8)

రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో.. స్వామివారు ఊరేగారు. పూల అలంకరణలో స్వామివారు మరింత అందంగా భక్తులకు దర్శనమిచ్చారు.
(2 / 8)

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయించనున్నారు.
(3 / 8)

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
(4 / 8)

వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
(5 / 8)

శ్రీవారి ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపులో.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 
(6 / 8)

ఊరేగింపులో భాగంగా.. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేశారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. విఐపి, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
(7 / 8)

ఈ ఊరేగింపులో.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి