తెలుగు న్యూస్  /  ఫోటో  /  రిస్క్​ లేకుండా మంచి రిటర్నులు కావాలా? ఇది మీకోసమే..

రిస్క్​ లేకుండా మంచి రిటర్నులు కావాలా? ఇది మీకోసమే..

21 July 2023, 11:52 IST

స్టాక్​ మార్కెట్​ ఇన్​వెస్ట్​మెంట్​లో రిస్క్​ చూసి భయపడుతున్నారా? అలా అని ఇన్​వెస్ట్​మెంట్​ చేయకపోవడం తప్పే కదా! అందుకే రిస్క్​ లేని పోస్టాఫీస్​ పథకాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

  • స్టాక్​ మార్కెట్​ ఇన్​వెస్ట్​మెంట్​లో రిస్క్​ చూసి భయపడుతున్నారా? అలా అని ఇన్​వెస్ట్​మెంట్​ చేయకపోవడం తప్పే కదా! అందుకే రిస్క్​ లేని పోస్టాఫీస్​ పథకాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​- ఇది చాలా పాప్యులర్​. 5ఏళ్ల పాటు ఇందులో ఇన్​వెస్ట్​ చేయవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.7శాతం వడ్డీ లభిస్తోంది.
(1 / 7)

కిశాన్​ వికాశ్​ పాత్ర- ఇందులో కనీసం పెట్టుబడి రూ. 1000. ప్రస్తుతం దీనిపై 7శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్​లో వేసిన డబ్బులు 123 నెలల్లో రెట్టింపు అవుతుంది!
(2 / 7)

పోస్టాఫీస్​ టైమ్​ డిపాజిట్​- ఇది ఎఫ్​డీలాగానే ఉంటుంది. 1-5ఏళ్ల వరకు ఇన్​వెస్ట్​ చేయవచ్చు. ప్రస్తుతం 1 ఇయర్​ పీరియడ్​ ఉన్న వాటిపై 6.9శాతం వడ్డీ లభిస్తోంది. 2-3ఏళ్ల ఇన్​వెస్ట్​మెంట్స్​పై 7శాతం, ఆ తర్వాత వాటిపై 7.5శాతం వరకు వడ్డీ వస్తోంది.
(3 / 7)

ఎంఐఎస్​ (మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​)- రెగ్యులర్​ ఇన్​కమ్​ కోసం ఇది మంచి పెట్టుబడి అవుతుంది. దీనిపై ప్రస్తుతం 7.4శాతం వడ్డీ వస్తోంది. అయితే మొదటి 5ఏళ్లల్లో క్యాపిటల్​ లాక్​ అయి ఉంటుంది.
(4 / 7)

పోస్టాఫీస్​ సేవింగ్స్​ అకౌంట్​- ఇది సాధారణమైన సేవింగ్స్​ అకౌంట్​తో సమానం. దీనిపై ప్రస్తుతం 4శాతం వడ్డీ వస్తోంది. టీడీఎస్​ కటింగ్​ ఉండదు. అయితే ట్యాక్స్​ మాత్రం పడుతుంది.
(5 / 7)

పోస్టాఫీస్​ రికరింగ్​ డిపాజిట్​- తక్కువ డబ్బులతో ఎఫ్​డీ చేయాలనుకునే వారికి ఈ ఆర్​డీ ఉపయోగపడుతుంది. రూ. 100 నుంచే డిపాజిట్​ మొదలవుతుంది. 5ఏళ్ల ఆర్​డీపై ప్రస్తుతం 6.5శాతం వరకు వడ్డీ వస్తోంది.
(6 / 7)

పీపీఎఫ్​- అంటే పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​. దీని చాలా ఫేమస్​ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనిపై 7.1శాతం వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్​ 15ఏళ్ల పాటు ఉంటుంది. ఏడేళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే కొంతకొత విత్​డ్రా చేసుకోవచ్చు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి