తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కాజీరంగా నేషనల్​ పార్క్​లో ప్రధాని మోదీ 'సవారీ'.. ఫొటోలు వైరల్​!

కాజీరంగా నేషనల్​ పార్క్​లో ప్రధాని మోదీ 'సవారీ'.. ఫొటోలు వైరల్​!

09 March 2024, 12:45 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కాజీరంగా నేషనల్​ పార్క్​ని సందర్శించారు. ఆ ఫొటోలను షేర్​ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కాజీరంగా నేషనల్​ పార్క్​ని సందర్శించారు. ఆ ఫొటోలను షేర్​ చేశారు.
అసోంలోని కాజీరంగా నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 'ఎలిఫెంట్ రైడ్'ని ఆస్వాదించారు.
(1 / 7)
అసోంలోని కాజీరంగా నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 'ఎలిఫెంట్ రైడ్'ని ఆస్వాదించారు.(X/@narendramodi)
జీప్​లో సఫారీకి వెళ్లిన మోదీ.. కెమెరాతో అద్భుత దృశ్యాలను తీశారు.
(2 / 7)
జీప్​లో సఫారీకి వెళ్లిన మోదీ.. కెమెరాతో అద్భుత దృశ్యాలను తీశారు.(X/@narendramodi)
కాజీరంగా నేషనల్​ పార్క్​లో మహిళా పోలీసులతో మోదీ ముచ్చటించారు.
(3 / 7)
కాజీరంగా నేషనల్​ పార్క్​లో మహిళా పోలీసులతో మోదీ ముచ్చటించారు.(X/@narendramodi)
నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు.
(4 / 7)
నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు.(X/@narendramodi)
''అడవులు, వన్యప్రాణులను ధైర్యంగా సంరక్షిస్తున్న మహిళా ఫారెస్ట్ గార్డుల బృందంతో సంభాషించాను. మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి అంకితభావం, ధైర్యం నిజంగా స్ఫూర్తిదాయకం." అని మోదీ చెప్పుకొచ్చారు.
(5 / 7)
''అడవులు, వన్యప్రాణులను ధైర్యంగా సంరక్షిస్తున్న మహిళా ఫారెస్ట్ గార్డుల బృందంతో సంభాషించాను. మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి అంకితభావం, ధైర్యం నిజంగా స్ఫూర్తిదాయకం." అని మోదీ చెప్పుకొచ్చారు.(X/@narendramodi)
నేషనల్​ పార్కును సందర్శించాలని ప్రజలను ప్రోత్సహించారు మోదీ. “మీరందరూ కాజీరంగా నేషనల్ పార్క్​ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమాన సౌందర్యాన్ని, అసోం ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అసోం మీ హృదయానికి కనెక్ట్​ అవుతుంది” అని చెప్పారు మోదీ.
(6 / 7)
నేషనల్​ పార్కును సందర్శించాలని ప్రజలను ప్రోత్సహించారు మోదీ. “మీరందరూ కాజీరంగా నేషనల్ పార్క్​ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమాన సౌందర్యాన్ని, అసోం ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అసోం మీ హృదయానికి కనెక్ట్​ అవుతుంది” అని చెప్పారు మోదీ.(X/@narendramodi)
ప్రధాని మోదీ.. లఖిమై, ప్రద్యుమ్న, ఫూల్మై అనే ఏనుగులకు చెరకు తినిపించారు. ''లఖిమై, ప్రద్యుమ్న, ఫూల్మైలకు చెరకు తినిపించాను. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కాజీరంగాలో అనేక ఇతర జాతుల జంతువులతో పాటు పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి," అని మోదీ ట్వీట్​ చేశారు.
(7 / 7)
ప్రధాని మోదీ.. లఖిమై, ప్రద్యుమ్న, ఫూల్మై అనే ఏనుగులకు చెరకు తినిపించారు. ''లఖిమై, ప్రద్యుమ్న, ఫూల్మైలకు చెరకు తినిపించాను. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కాజీరంగాలో అనేక ఇతర జాతుల జంతువులతో పాటు పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి," అని మోదీ ట్వీట్​ చేశారు.(X/@narendramodi)

    ఆర్టికల్ షేర్ చేయండి