తెలుగు న్యూస్  /  ఫోటో  /  Butterfly Plants: సీతాకోకచిలుకలను ఆకర్షించే మొక్కలివే.. మీ గార్డెన్ లోనూ నాటేయండిక

Butterfly plants: సీతాకోకచిలుకలను ఆకర్షించే మొక్కలివే.. మీ గార్డెన్ లోనూ నాటేయండిక

16 July 2024, 17:00 IST

Butterfly plants: గార్డెన్ లో సీతాకోక చిలుకలుంటే అందంగా ఉంటుంది కదా. ఈ మొక్కలు నాటితే అవి సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి. వాటి లిస్టు చూసేయండి. 

Butterfly plants: గార్డెన్ లో సీతాకోక చిలుకలుంటే అందంగా ఉంటుంది కదా. ఈ మొక్కలు నాటితే అవి సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి. వాటి లిస్టు చూసేయండి. 
పుస్తకాల్లో, సినిమాల్లో అందమైన గార్డెన్ గురించి వివరించేటప్పుడు మొదట చెప్పేది, చూయించేది సీతాకోకచిలుకలనే. వాటి అందమే వేరు. అవి ఎగురుతుంటే చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఆసక్తిగా చూస్తాం. రంగురంగుల సీతకోక చిలుకలు ఎగురుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అయితే ఈ మీ ఇంటి గార్డెన్ లోకే ఈ సీతాకోక చిలుకలు వచ్చి రంగుల మ్యాజిక్ చేయాలంటే మీ గార్డెన్ లో ఈ మొక్కలు నాటండి చాలు. ఆ మొక్కలేంటో చూడండి.
(1 / 6)
పుస్తకాల్లో, సినిమాల్లో అందమైన గార్డెన్ గురించి వివరించేటప్పుడు మొదట చెప్పేది, చూయించేది సీతాకోకచిలుకలనే. వాటి అందమే వేరు. అవి ఎగురుతుంటే చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఆసక్తిగా చూస్తాం. రంగురంగుల సీతకోక చిలుకలు ఎగురుతుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అయితే ఈ మీ ఇంటి గార్డెన్ లోకే ఈ సీతాకోక చిలుకలు వచ్చి రంగుల మ్యాజిక్ చేయాలంటే మీ గార్డెన్ లో ఈ మొక్కలు నాటండి చాలు. ఆ మొక్కలేంటో చూడండి.(Pexels)
బంతిపూల చెట్టు మనకు చాలా సులభంగా దొరుకుతాయి. వాటి నిర్వహణకు కూడా ఎక్కువ శ్రమ అక్కర్లేదు. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే ఈ పూల చెట్లుంటే సీతాకోకచిలుకలు ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఆ చెట్ల మీద రంగు సీతాకోక చిలుక వాలితే ఎంత బాగుంటుందో చూడ్డానికి. 
(2 / 6)
బంతిపూల చెట్టు మనకు చాలా సులభంగా దొరుకుతాయి. వాటి నిర్వహణకు కూడా ఎక్కువ శ్రమ అక్కర్లేదు. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే ఈ పూల చెట్లుంటే సీతాకోకచిలుకలు ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఆ చెట్ల మీద రంగు సీతాకోక చిలుక వాలితే ఎంత బాగుంటుందో చూడ్డానికి. (Pexels)
ల్యావెండర్ మొక్కలు, పూలు సువాసనలు వెదజల్లుతూ, అందమైన రంగులో ఉంటాయి. ఈ అందమైన మొక్కంటే సీతాకోకలకు కూడా ఇష్టమేనట. దీని నిర్వహణ కాస్త కష్టమే అయినా కూడా ఒక్కసారి నాటితే గార్డెన్ కు మంచి లుక్ వస్తుంది. ఆ ఊదా రంగు పూల మీద సీతాకోక చిలుకలు వాడితే ఎంత బాగుంటుందో చూడండి. 
(3 / 6)
ల్యావెండర్ మొక్కలు, పూలు సువాసనలు వెదజల్లుతూ, అందమైన రంగులో ఉంటాయి. ఈ అందమైన మొక్కంటే సీతాకోకలకు కూడా ఇష్టమేనట. దీని నిర్వహణ కాస్త కష్టమే అయినా కూడా ఒక్కసారి నాటితే గార్డెన్ కు మంచి లుక్ వస్తుంది. ఆ ఊదా రంగు పూల మీద సీతాకోక చిలుకలు వాడితే ఎంత బాగుంటుందో చూడండి. (Pixabay)
క్రిసాంథిమం లేదా చేమంతి మొక్కలో బోలెడన్ని రకాలుంటాయి. పసుపు నుంచి పర్పుల్ రంగు దాకా చాలా రకాల పూలున్నాయి దీంట్లో. ఈ రంగులు సీతాకోక చిలుకలను బాగా ఆకర్షిస్తాయి. ఈ పూలు విచ్చుకుని ఉండటం వల్ల సీతాకోక చిలుకలకు మకరందం, పుప్పొడి తీసుకోవడం సులభం అవుతుందట. 
(4 / 6)
క్రిసాంథిమం లేదా చేమంతి మొక్కలో బోలెడన్ని రకాలుంటాయి. పసుపు నుంచి పర్పుల్ రంగు దాకా చాలా రకాల పూలున్నాయి దీంట్లో. ఈ రంగులు సీతాకోక చిలుకలను బాగా ఆకర్షిస్తాయి. ఈ పూలు విచ్చుకుని ఉండటం వల్ల సీతాకోక చిలుకలకు మకరందం, పుప్పొడి తీసుకోవడం సులభం అవుతుందట. (Pexels)
గుత్తులుగా ఉండే పూల చెట్టు ఇంట్లో ఉంటే ఇంటికే అందం. దీన్నే వెస్ట్ ఇండియన్ జాస్మీన్ అంటారు. ఇవి ఎరుపు, గులాబీ, ఆరెంజ్, క్రీం రంగుల్లో గుత్తుల్లా పూస్తాయివి. వీటిని మీ గార్డెన్ లో ఉంచుకోవడం వల్ల సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి. 
(5 / 6)
గుత్తులుగా ఉండే పూల చెట్టు ఇంట్లో ఉంటే ఇంటికే అందం. దీన్నే వెస్ట్ ఇండియన్ జాస్మీన్ అంటారు. ఇవి ఎరుపు, గులాబీ, ఆరెంజ్, క్రీం రంగుల్లో గుత్తుల్లా పూస్తాయివి. వీటిని మీ గార్డెన్ లో ఉంచుకోవడం వల్ల సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి. 
చివరగా కరివేపాకు మొక్క. దీనికి పూలు లేకపోయినా కూడా సీతాకోకచిలుకలకు ఈ చెట్టంటే ఇష్టం. గుడ్లు పెట్టడానికి ఈ ఆకులు అనువుగా ఉండటమే కారణం. గొంగలిపురుగులు ఈ ఆకుల్ని తిని, పెరిగి సీతాకోక చిలుకల్లాగా మారతాయి. ఇంకేం.. తప్పకుండా ఈ మొక్కను నాటేయండి. వాటిని ఆకర్షించడం కాదు. మీ గార్డెన్ లోనే సీతాకోక చిలుకలు పుట్టేస్తాయి. 
(6 / 6)
చివరగా కరివేపాకు మొక్క. దీనికి పూలు లేకపోయినా కూడా సీతాకోకచిలుకలకు ఈ చెట్టంటే ఇష్టం. గుడ్లు పెట్టడానికి ఈ ఆకులు అనువుగా ఉండటమే కారణం. గొంగలిపురుగులు ఈ ఆకుల్ని తిని, పెరిగి సీతాకోక చిలుకల్లాగా మారతాయి. ఇంకేం.. తప్పకుండా ఈ మొక్కను నాటేయండి. వాటిని ఆకర్షించడం కాదు. మీ గార్డెన్ లోనే సీతాకోక చిలుకలు పుట్టేస్తాయి. (Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి