తెలుగు న్యూస్  /  ఫోటో  /  Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

16 September 2023, 10:41 IST

Palamuru Rangareddy Lift Irrigation Scheme : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని CM KCR శనివారం ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద నిర్మించిన మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు మీటనొక్కి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలెంటో ఇక్కడ చూద్దాం…

  • Palamuru Rangareddy Lift Irrigation Scheme : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని CM KCR శనివారం ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద నిర్మించిన మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు మీటనొక్కి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలెంటో ఇక్కడ చూద్దాం…
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుతో పాలమూరు గడ్డపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది.
(1 / 7)
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుతో పాలమూరు గడ్డపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది.(Twitter)
శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు. దీనిలో భాగంగా తొలి పంపుహౌసులో మొదటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్‌ కేంద్రం నుంచి పంపును మీట నొక్కి నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
(2 / 7)
శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు. దీనిలో భాగంగా తొలి పంపుహౌసులో మొదటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్‌ కేంద్రం నుంచి పంపును మీట నొక్కి నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.(Twitter)
ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం ఫలితంగా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌,  నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కొడంగల్ కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాలకు  తాగు, సాగునీరు అందుతుంది. 
(3 / 7)
ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం ఫలితంగా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌,  నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కొడంగల్ కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాలకు  తాగు, సాగునీరు అందుతుంది. (Twitter)
ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.  
(4 / 7)
ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.  (Twitter)
సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న అతిపెద్ద మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభింస్తారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు, జలహారతి నిర్వహించనున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
(5 / 7)
సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న అతిపెద్ద మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభింస్తారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు, జలహారతి నిర్వహించనున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.(Twitter)
పంపుల ఆపరేటింగ్‌ అంతా కంప్యూటర్‌ తెరపై నుంచే నిర్వహించే వీలుగా ఇంజనీరింగ్ యంత్రంగాం ఏర్పాట్లు చేసింది. నీరు విడుదలయ్యేలా గేట్లు తెరుచుకోవడం, మోటారుకు విద్యుత్‌ సరఫరా.. ఇవన్నీ కంప్యూటర్‌ నుంచే పర్యవేక్షిస్తారు. ఆసియా ఖండంలోనే తొలిసారి అతి పెద్దదైన ఎత్తిపోతల పంపులను  పాలమూరు ప్రాజెక్టులో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
(6 / 7)
పంపుల ఆపరేటింగ్‌ అంతా కంప్యూటర్‌ తెరపై నుంచే నిర్వహించే వీలుగా ఇంజనీరింగ్ యంత్రంగాం ఏర్పాట్లు చేసింది. నీరు విడుదలయ్యేలా గేట్లు తెరుచుకోవడం, మోటారుకు విద్యుత్‌ సరఫరా.. ఇవన్నీ కంప్యూటర్‌ నుంచే పర్యవేక్షిస్తారు. ఆసియా ఖండంలోనే తొలిసారి అతి పెద్దదైన ఎత్తిపోతల పంపులను  పాలమూరు ప్రాజెక్టులో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.(Twitter)
పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ, పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల, వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందన్నారు. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం చేయనుందంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
(7 / 7)
పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ, పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల, వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందన్నారు. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం చేయనుందంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

    ఆర్టికల్ షేర్ చేయండి