తెలుగు న్యూస్  /  ఫోటో  /  Toll Tax Hike : వాహనదారులకు అలర్ట్ - ఆ తేదీ తర్వాత పెరగనున్న టోల్ ఛార్జీలు..! ఇవిగో తాజా అప్డేట్స్

Toll Tax Hike : వాహనదారులకు అలర్ట్ - ఆ తేదీ తర్వాత పెరగనున్న టోల్ ఛార్జీలు..! ఇవిగో తాజా అప్డేట్స్

22 May 2024, 10:29 IST

New Toll Rates On Highways 2024: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు పెరగనున్నాయి. ఆ దిశగా ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు పూర్తి చేసింది. కొత్త ధరలు జూన్ 1వ తేదీ  తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

  • New Toll Rates On Highways 2024: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు పెరగనున్నాయి. ఆ దిశగా ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు పూర్తి చేసింది. కొత్త ధరలు జూన్ 1వ తేదీ  తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
వాహనదారులకు మరో అలర్ట్ వచ్చేసింది. త్వరలోనే జాతీయ రహదారులపై టోల్ ఫీజులు పెరగనున్నాయి. ఆ దిశగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) కసరత్తు పూర్తి చేసింది. త్వరలోనే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
(1 / 6)
వాహనదారులకు మరో అలర్ట్ వచ్చేసింది. త్వరలోనే జాతీయ రహదారులపై టోల్ ఫీజులు పెరగనున్నాయి. ఆ దిశగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) కసరత్తు పూర్తి చేసింది. త్వరలోనే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.(Photo source @NHAI_Official Twitter)
ప్రతి ఏడాది  ఏప్రిల్‌ 1న టోల్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ఈసారి కూడా ఈ నిర్ణయం అమల్లోకి రావాల్సి ఉండేది. కానీ లోక్ సభ ఎన్నికలు ఉండటంతో  కొత్త రేట్లు అమల్లోకి రాలేదు.  టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని NHAIకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. 
(2 / 6)
ప్రతి ఏడాది  ఏప్రిల్‌ 1న టోల్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ఈసారి కూడా ఈ నిర్ణయం అమల్లోకి రావాల్సి ఉండేది. కానీ లోక్ సభ ఎన్నికలు ఉండటంతో  కొత్త రేట్లు అమల్లోకి రాలేదు.  టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని NHAIకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. (Photo source @NHAI_Official Twitter)
ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పెంపు నిర్ణయంపై ముందుకెళ్లాలని ఈసీ సూచించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ఉండగా,,,జూన్ 1వ తేదీన  చివరి దశ పోలింగ్ ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.
(3 / 6)
ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పెంపు నిర్ణయంపై ముందుకెళ్లాలని ఈసీ సూచించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ఉండగా,,,జూన్ 1వ తేదీన  చివరి దశ పోలింగ్ ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.(Photo source @NHAI_Official Twitter)
జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ పూర్తి కానున్నడటంతో అదే రోజు అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఎన్ హెచ్ ఐఏ టోల్ ప్లాజా  నిర్వాహకులకు ఆదేశాలను ఇచ్చినట్లు తెలిసింది. 
(4 / 6)
జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ పూర్తి కానున్నడటంతో అదే రోజు అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఎన్ హెచ్ ఐఏ టోల్ ప్లాజా  నిర్వాహకులకు ఆదేశాలను ఇచ్చినట్లు తెలిసింది. (Photo source @NHAI_Official Twitter)
ప్రతి ఏడాది  టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జాతీయ రహదారులపై  దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు సేకరణ) రూల్స్, 2008 ప్రకారం వినియోగదారు రుసుము విధించబడుతుంది. 
(5 / 6)
ప్రతి ఏడాది  టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జాతీయ రహదారులపై  దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు సేకరణ) రూల్స్, 2008 ప్రకారం వినియోగదారు రుసుము విధించబడుతుంది. (Image Source Facebook)
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-వరంగల్‌ (163) హైవేలపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విజయవాడ నేషనల్ హైవేపై పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. వరంగల్‌ హైవేపై బీబీనగర్‌ మండలం గూడురు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు సుమారు 30 వేలకు పైగా, గూడూరు టోల్‌ప్లాజా వద్ద 27 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతుంటాయి. టోల్‌ప్లాజా మీదుగా వెళ్లే వాహనాలకు వాటి స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.40 వరకు ఛార్జ్ చేస్తారు. స్థానికులకు ఇచ్చే పాస్‌లపై రాయితీతో కూడిన రుసుం  విధిస్తారు. జూన్ మొదటి వారంలో ఛార్జీల పెంపునకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
(6 / 6)
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-వరంగల్‌ (163) హైవేలపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విజయవాడ నేషనల్ హైవేపై పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. వరంగల్‌ హైవేపై బీబీనగర్‌ మండలం గూడురు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు సుమారు 30 వేలకు పైగా, గూడూరు టోల్‌ప్లాజా వద్ద 27 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతుంటాయి. టోల్‌ప్లాజా మీదుగా వెళ్లే వాహనాలకు వాటి స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.40 వరకు ఛార్జ్ చేస్తారు. స్థానికులకు ఇచ్చే పాస్‌లపై రాయితీతో కూడిన రుసుం  విధిస్తారు. జూన్ మొదటి వారంలో ఛార్జీల పెంపునకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.(Photo source @NHAI_Official Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి