తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heart Attack: నిద్రకు, గుండె పోటుకు మధ్య సంబంధాన్ని చెప్పిన కొత్త అధ్యయనం

Heart Attack: నిద్రకు, గుండె పోటుకు మధ్య సంబంధాన్ని చెప్పిన కొత్త అధ్యయనం

23 February 2024, 11:09 IST

నిద్రకు, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధాన్ని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

  • నిద్రకు, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధాన్ని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
మన ఆహారంతో పాటు మన జీవనశైలి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారపు అలవాట్లు ఎంత అవసరమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. అందుకే తగినంత నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  నిద్రలేమి వల్ల గుండె దెబ్బతింటుంది. 
(1 / 5)
మన ఆహారంతో పాటు మన జీవనశైలి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారపు అలవాట్లు ఎంత అవసరమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. అందుకే తగినంత నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  నిద్రలేమి వల్ల గుండె దెబ్బతింటుంది. (Freepik)
రాత్రి పూట ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా మేల్కొనడం వల్ల స్ట్రోక్, గుండెపోటు,  పక్షవాతం వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తక్కువగా నిద్రపోతూ ఉంటారు, తద్వారా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తెలుస్తోంది.
(2 / 5)
రాత్రి పూట ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా మేల్కొనడం వల్ల స్ట్రోక్, గుండెపోటు,  పక్షవాతం వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు తక్కువగా నిద్రపోతూ ఉంటారు, తద్వారా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తెలుస్తోంది.(Freepik)
గుండె జబ్బులు లేదా సివిడి మహిళల మరణానికి ప్రధాన కారణం మరియు పేలవమైన నిద్ర మహిళలకు ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఒక కొత్త అధ్యయనం నిద్రలేమి మరియు గుండె జబ్బులను అనుసంధానిస్తుంది. తగినంత నిద్ర గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షించే సామర్థ్యాన్ని పెంచుతుంది.
(3 / 5)
గుండె జబ్బులు లేదా సివిడి మహిళల మరణానికి ప్రధాన కారణం మరియు పేలవమైన నిద్ర మహిళలకు ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఒక కొత్త అధ్యయనం నిద్రలేమి మరియు గుండె జబ్బులను అనుసంధానిస్తుంది. తగినంత నిద్ర గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షించే సామర్థ్యాన్ని పెంచుతుంది.(Freepik)
పరిశోధకులు 42 నుంచి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,964 మంది మహిళల నిద్ర అలవాట్లు, ఆరోగ్య ఫలితాలను అంచనా వేశారు. ఈ అధ్యయనంలో మెనోపాజ్ చెందిన మహిళలు, మెనోపాజ్ కాని మహిళలు కూడా ఉన్నారు. నలుగురు మహిళల్లో ఒకరు క్రమరహిత నిద్ర, నిద్రలేమి, రాత్రిపూట మేల్కొని ఉండడం వంటి సమస్యలను కలిగి ఉన్నారు. 
(4 / 5)
పరిశోధకులు 42 నుంచి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,964 మంది మహిళల నిద్ర అలవాట్లు, ఆరోగ్య ఫలితాలను అంచనా వేశారు. ఈ అధ్యయనంలో మెనోపాజ్ చెందిన మహిళలు, మెనోపాజ్ కాని మహిళలు కూడా ఉన్నారు. నలుగురు మహిళల్లో ఒకరు క్రమరహిత నిద్ర, నిద్రలేమి, రాత్రిపూట మేల్కొని ఉండడం వంటి సమస్యలను కలిగి ఉన్నారు. (Freepik)
రాత్రిపూట ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారికి, రాత్రి సమయంలో ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 75 శాతం ఎక్కువ.
(5 / 5)
రాత్రిపూట ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారికి, రాత్రి సమయంలో ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 75 శాతం ఎక్కువ.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి